'మిస్డ్ కాల్ వస్తే తిరిగి చేయొద్దు..' | Sakshi
Sakshi News home page

'మిస్డ్ కాల్ వస్తే తిరిగి చేయొద్దు..'

Published Mon, Feb 23 2015 12:58 PM

'మిస్డ్ కాల్ వస్తే తిరిగి చేయొద్దు..' - Sakshi

రనితా డిసౌజా అనే ఆవిడ..గాఢ నిద్రలో ఉండగా  సరిగ్గా అర్థరాత్రి 1.30కు ఓ ఫోన్కు కాల్ వచ్చింది. ఆమె సెల్ ఫోన్  ఎత్తాక అవతలి వ్యక్తి మాట్లాడకుండా కట్ చేశారు. ఆ ఫోన్ కాల్ కోడ్ ప్లస్ 216గా ఉంది. దీంతో అది ముఖ్యమైన ఫోన్ కాల్ అనుకొని రనితా డిసౌజా తిరిగి  ఆ నెంబర్ కు కాల్ చేయగా అవతల ఫోన్ ఎత్తారు కానీ ఏం మాట్లాడలేదు.. దీంతో  ఆమె ఫోన్ పెట్టేశారు. తీరా చూస్తే  ఆమె సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ మాత్రం ఒక్కసారిగా 60 రూపాయలు కట్ అయింది. దాంతో ఖంగుతిన్నరనితా డిసౌజా  కస్టమర్ కేర్ కు కాల్ చేసి బ్యాలెన్స్ కట్ అయినట్లు ఫిర్యాదు చేశారు.

అయితే ఇది రనితా డిసౌజా ఒక్కరి సమస్యే కాదు.. ఇలాంటి సమస్యలు ఈ మధ్య చాలా ఎక్కువయ్యాయి. చాలామందికి తెలియక ఇలాంటి నెంబర్లను చూసి పొరపడి  తిరిగి  ఫోన్లు చేస్తున్నారు. దీనిపై ఎయిర్టెల్ సంస్థకు చెందిన శరత్ తేజస్వీ అనే వ్యక్తి స్పందిస్తూ ఇప్పటికే తాము తమ కస్టమర్లకు ఇలాంటి నెంబర్ల నుంచి మిస్డ్ కాల్ వస్తే తిరిగి చేయొద్దని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు.   

Advertisement
Advertisement