డీఆర్‌డీవో శాస్త్రవేత్త సతీశ్‌రెడ్డికి ‘రిన్’ ఫెలోషిప్ | Sakshi
Sakshi News home page

డీఆర్‌డీవో శాస్త్రవేత్త సతీశ్‌రెడ్డికి ‘రిన్’ ఫెలోషిప్

Published Thu, Apr 30 2015 1:54 AM

డీఆర్‌డీవో శాస్త్రవేత్త సతీశ్‌రెడ్డికి ‘రిన్’ ఫెలోషిప్

న్యూఢిల్లీ: రక్షణ పరిశోధన,అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) సీనియర్ శాస్త్రవేత్త జి. సతీశ్ రెడ్డికి ప్రఖ్యాత ‘ఫెలోషిప్ ఆఫ్ ది రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేవిగేషన్’ లభించింది. ఆ ఫెలోషిప్ సాధించిన తొలి భారతీయుడు సతీశ్ రెడ్డినే. ప్రస్తుతం డీఆర్‌డీవో పరిశోధన సంస్థ ‘ఇమారత్’ డెరైక్టర్‌గా విధుల్లో ఉన్న సతీశ్ ‘అగ్ని 5’ క్షిపణి రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఘర్షణాత్మక, ఉపగ్రహ ఆధారిత నేవిగేషన్‌తో పాటు విమానయానంలో వాడే ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఆయనకు 30 ఏళ్ల అనుభవం ఉంది.

ఆయా రంగాల్లో ఆయన సాధించిన విజయాలు అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. నేవిగేషన్‌లో ప్రగతిదాయక పరిశోధనలకు పేరుగాంచిన ‘రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేవిగేషన్(ఆర్‌ఐఎన్)’ 1947లో ఏర్పాటైంది. 150 మంది నేవిగేషన్  ప్రముఖులు ఆర్‌ఐఎన్ ఫెలోషిప్ సాధించారు.

Advertisement
Advertisement