ఇక ‘డైరెక్టు’గా ఇంట్లోనే చదువు | Sakshi
Sakshi News home page

ఇక ‘డైరెక్టు’గా ఇంట్లోనే చదువు

Published Wed, Oct 9 2013 4:52 AM

Education channels to come in DTH

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఉన్న వాటి కంటే విభిన్నంగా రూపొందించిన కార్యక్రమాలతో యాభై డీటీహెచ్ (డెరైక్ట్-టు-హోమ్) ఎడ్యుకేషన్ చానల్స్ త్వరలో రాబోతున్నాయి. రికార్డింగ్ పాఠాలను కాకుండా ఇవి క్లాసు నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. ఎన్‌ఎంఈఐసీటీ జాతీయ వర్క్‌షాప్‌లో ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి ఆశిక్ ఠాకూర్ మంగళవారం ఈ విషయం వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రపంచంలోనే ఇదే మొదటిదని ఆశిక్ చెప్పారు. ఇటువంటి చానల్స్‌ను భవిష్యత్‌లో వెయ్యి వరకూ విస్తరిస్తామని తెలిపారు. ఇదో పెద్ద క్లాస్ కాబోతోందని, దీనితో మారుమూల ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యాప్రమాణాలు మెరుగవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement