పీఎఫ్ డిపాజిట్లపై 9శాతం వడ్డీ? | Sakshi
Sakshi News home page

పీఎఫ్ డిపాజిట్లపై 9శాతం వడ్డీ?

Published Fri, Feb 5 2016 3:31 AM

EPFO likely to announce 9% interest on PF deposits

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ.. ఈపీఎఫ్‌వో 2015-16 సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీని తొమ్మిది శాతానికి పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 16న చెన్నైలో జరగనున్న ట్రస్టీల సమావేశంలో దీనిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. గత రెండేళ్లుగా పీఎఫ్‌పై సంస్థ 8.75శాతం వడ్డీ ఇస్తోంది.  అయితే.. ఈపీఎఫ్‌వో సలహా సంఘం దీన్ని 8.95కి పెంచాలని సూచించింది.
 

Advertisement
Advertisement