తమిళనాడు మాజీ మంత్రి అరెస్ట్ | Sakshi
Sakshi News home page

తమిళనాడు మాజీ మంత్రి అరెస్ట్

Published Sun, Apr 5 2015 9:52 PM

Ex-minister arrested in connection with official's suicide

చెన్నై: ఓ అధికారి బలవన్మరణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు మాజీ మంత్రి అగ్రి కృష్ణమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి ఆయన్ను విచారించిన సీబీ సీఐడీ అధికారులు అనంతరం అరెస్ట్ చేశారు.ఆయనతో పాటు ఇంజనీరింగ్ శాఖ అధికారి సెంథిల్ ను కూడా అరెస్ట్ చేసి ఆదివారం తిరునల్వేలి జ్యుడిషయల్ ఎదుట హాజరుపరిచారు.వారికి మెజిస్ట్రేట్ 15 రోజుల వరకూ జ్యుడిషయల్ కస్టడీ విధించడంతో జైలుకు తరలించారు.

 

ఆ వివాదం చోటు చేసుకున్న తరువాత కృష్ణమూర్తి కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురయ్యారు.ఏడుగురు డ్రైవర్ల నియామకంపై ఇంజనీరింగ్ శాఖ సీనియర్ అధికారి ముత్తు కుమారస్వామిపై కృష్ణమూర్తి ఒత్తిడి తెచ్చారని.. దీంతో ఆయన రైలు కింద పడి ఆత్మహత్య కు పాల్పడినట్లు కృష్ణమూర్తిపై ఆరోపణలు ఉన్నాయి.

Advertisement
Advertisement