కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త

Published Sun, Apr 17 2016 5:12 PM

కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త

హైదరాబాద్:  కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టు కార్మికులకు స్థిర వేతనం కల్పించేందుకు చట్టం చేయబోతున్నట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు.
 
ఇకపై వారి కనీస వేతనం పదివేల రూపాయలు గా ఉండేందుకు చట్టం రూపొందించామని చెప్పారు. దేశం మొత్తం కార్మికులకు ఒకే రకమైన వేతనం ఉండేలా చూసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని తెలిపారు. ఇందుకోసం కాంట్రాక్టు కార్మికుల  చట్టంలో 25 మార్పులను చేయబోతున్నట్టు చెప్పారు. ఈ చట్టం రూపొందించే విషయంలో ప్రతిపక్షాలు సహకరించడం లేదని విమర్శించారు. పార్లమెంటు సరిగా పని చేయని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక చట్టమే మార్గమన్నారు. కేంద్ర న్యాయశాఖకు పరిశీలనకు ఫైలును పంపినట్టు తెలిపారు. ప్రతి కాంట్రాక్టర్ కార్మిక శాఖ దగ్గర తప్పకుండా రిజిష్ట్రేన్ చేయించుకోవాలని మంత్రి చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరల ఆధారంగా వేతనం, కరువు భత్యం(డీఏ) ఉండాలని సుప్రీ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈచట్టం అమల్లోకి వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్నలక్ష మంది  పారిశుధ్య కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. దేశ వ్యాప్తంగా కోట్లమంది కార్మికులు లబ్ధి పొందుతారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement