భారత్, పాక్ కాన్సులేట్ల వద్ద భారీ పేలుళ్లు | Sakshi
Sakshi News home page

భారత్, పాక్ కాన్సులేట్ల వద్ద భారీ పేలుళ్లు

Published Wed, Jan 13 2016 11:17 AM

భారత్, పాక్ కాన్సులేట్ల వద్ద భారీ పేలుళ్లు

- అఫ్ఘానిస్థాన్ లో ఇరుదేశాల కాన్సులేట్ ల వద్ద ఉగ్రవాదుల దుశ్చర్య


విదేశీ దౌత్యకార్యాలయాలే లక్ష్యంగా అఫ్ఘానిస్థాన్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నంగార్హర్ ప్రావిన్స్ లోని జలాలాబాద్ లో గల ఇండియన్ పాకిస్థానీ కానసులేట్ లకు అతి సమీపంలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. దీనిని ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిగా అభివర్ణించిన స్థానిక అధికారులు.. పేలడులో నలుగురు పోలీసులు చనిపోయారని, పేలుడు తర్వాత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారని తెలిపారు.

 

కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని,  అయితే భారత దౌత్యకార్యాలయ సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు అధికారిక సమాచారం. పేలుడు అనంతరం పాకిస్థాన్ తన దౌత్యకార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. మజర్ ఇ షరీఫ్ పట్టణంలోని భారత దౌత్యకార్యాలయం దాడి జరిగిన 10 రోజులకే, జలాలాబాద్ లో మరో సంఘటన చోటుచేసుకోవటంతో దౌత్యాధికారుల గుండెల్లో గుబులురేపింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement