మహిళా జర్నలిస్టు అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

మహిళా జర్నలిస్టు అనుమానాస్పద మృతి

Published Tue, May 3 2016 3:41 PM

మహిళా జర్నలిస్టు అనుమానాస్పద మృతి - Sakshi

ఫరీదాబాద్:  నేషనల్ మీడియా పోర్టల్ లో  పనిచేస్తున్న ఇండోర్ కు చెందిన  పూజా తివారి  అనే మహిళా జర్నలిస్టు  అనుమానాస్పద  స్థితిలో  మరణించడం కలకలం  రేపింది.  బలవంతపు వసూళ్ల  కేసులో  నిందితురాలిగా ఉన్న  పూజా  ఫరీదాబాద్లోని తన  అపార్ట్ మెంట్  అయిదవ అంతస్దు నుంచి కిందపడి చనిపోయింది.   

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం  పూజా తివారి జాతీయ మీడియా పోర్టల్  పనిచేస్తోంది. మరో జర్నలిస్టు అమ్రీన్  పోలీస్ ఆఫీసర్ అమిత్ కుమార్ తో కలిసి ఆదివారం సాయంత్రం నుంచి మద్యం  సేవించిన ఆమె రాత్రి భోజనం తర్వాత కూడా  దాన్ని కొనసాగించింది.  ఇంతలో ఏమైందో ఏమో కానీ తన నివాసంలో అయిదవ అంతస్తు నుంచి  దూకేసింది.   దీంతో  తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మద్యంమత్తులోనే ఉన్న పూజా  అకస్మాత్తుగా ఆగ్రహానికి గురై క్షణికావేశంలో,  పైనుంచి దూకేసినట్టుగా అమిత్, అమ్రిన్ తెలిపారని సూరజ్ కుంద్ ఎస్ ఓ రాజిందర్  సింగ్  వెల్లడించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు ప్రాథమిక నివేదికల ప్రకారం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా  అనుమానిస్తున్నారు.  అటు ఈ ఘటనపై పోస్ట్ మార్టం నివేదిక అధారంగా  అన్ని కోణాల్లో పరిశోధన చేయనున్నట్టు కమిషనర్ చెప్పారు.

మరోవైపు తివారిపై గతంలో చీటింగ్, బెదిరింపుల ఆరోపణలతో స్థానిక వైద్యుల దంపతులు ఆమెపై  ఎఫ్ఐఆర్  నమోదు చేశారు. దీంతో ఆమె పనిచేస్తున్న సంస్థ పూజాను  జీతం ఇవ్వకుండా సస్పెన్షన్ లో ఉంచింది. ఈ విషయాన్ని సన్నిహితులతో చర్చిస్తూ  ఆత్మహత్య పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందా, లేక మరేదైనా కోణం అనే ఉందా అనేది   దర్యాప్తులో తేలాల్సి ఉంది.  
 

Advertisement
Advertisement