వరద బీభత్సం.. ఓ రైతు పెద్దమనసు

12 Aug, 2019 09:04 IST|Sakshi

భారీ వర్షాలు, వరదలతో కేరళ, కర్ణాటక, మహారాష్ట రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. వందలమంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిగా ప్రజలు సర్వం కోల్పోయి సహాయక కేంద్రాల్లో కిక్కిరిసిపోతున్నాయి. వరద విపత్తు బృందాలు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయకచర్యల్లో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. 

కేరళలో వరదల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వాయనాడ్‌, మలప్పురం తదితర ప్రాంతాల్లో అనేక చోట కొండచరియలు విరిగి పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో బీభత్స వాతావరణం నెలకొంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. సర్వం కోల్పోయి ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేలాదిమంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. అయితే ఇంత కష్టంలోకూడా కేరళలోని రాజాకట్టకు చెందిన అశోకన్‌ అనే రైతు ఆదర్శవంతంగా నిలిచారు. సర్వం కోల్పోయినా మంచినీ, మానవత్వాన్నీ కోల్పోలేదు. వరద ధాటికి తోటలో వెయ్యికి పైగా అరటి చెట్లు నిట్టనిలువునా కుప్ప కూలిపోయాయి. చేతికొచ్చిన బంగారంలాంటి పంట సర్వ నాశనమైపోయింది. ఈ దృశ్యం చూసిన ఎవరికైనా గుండె చెరువు అవ్వక మానదు. ఇక ఆ రైతు పరిస్థితిని ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. 

అయితే తన దాతృత్వంతో మనిషిగా అందనంత ఎత్తున నిలిచారు. ప్రకృతి ప్రకోపానికి కూలింది చెట్లే కానీ, తాను కాదంటూ పెద్దమనసు చాటుకున్నారు. తన దగ్గర మిగిలిన కొద్దిపాటి అరటిపళ్లను, పనసకాయలు తదితరాలను బాధితులకివ్వమంటూ స్థానిక మీడియా సిబ్బందికి అందించారు. తన దగ్గర ఇంతకంటే ఏమీ మిగల్లేదని వాపోయారు. న్యూస్‌18 ప్రతినిధి షేర్‌ చేసిన ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో పలువుర్ని ఆకట్టుకుంటున్నాయి. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డెలివరీ బాయ్‌ల సమ్మె : జొమాటో వివరణ

ఆగని వరదలు

సీబీఎస్‌ఈ ఫీజు 24 రెట్లు పెంపు

ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తాం

కశ్మీర్‌పై ఉగ్రదాడికి కుట్ర..!

సవాళ్లను అధిగమిస్తారా?

వయనాడ్‌లో రాహుల్‌.. బాధితులకు పరామర్శ

బిల్లు చూసి ‘గుడ్లు’ తేలేసిన రచయిత..!

ఆర్టికల్‌ 370 ఎఫెక్ట్‌ : సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌కు బ్రేక్‌

ముషారఫ్‌ ఇంట్లో మికా సింగ్‌.. నెటిజన్ల ఆగ్రహం

‘చిక్కుల్లో కర్తార్‌పూర్‌ కారిడార్‌’

ప్రశాంతంగా జమ్మూకశ్మీర్‌!

ఆర్టికల్‌ 370 రద్దు.. ఉగ్రవాదం మటాష్‌!

ఈనాటి ముఖ్యాంశాలు

‘ఆ నేరాలను అడ్డుకోలేం’

‘షేక్‌’ చేస్తోన్న శశి థరూర్‌

బీజేపీలో చేరితే చంపుతామంటున్నారు!

‘తలుపులు మూస్తేనే కదా.. ఓటింగ్‌ జరిగేది’

జొమాటోకు డెలి‘వర్రీ’

మోదీ, షా కృష్ణార్జునులు: సూపర్‌ స్టార్‌

కానిస్టేబుల్‌‌కు యావత్తు దేశం సెల్యూట్

మెట్రో రైలు కింద దూకి వ్యక్తి ఆత్మహత్య

నెహ్రు ఓ క్రిమినల్‌ : చౌహాన్‌

ఢిల్లీ నడివీధుల్లో కళ్లల్లో కారంచల్లి..

వరద విలయం

370 రద్దుపై ఎన్‌సీ సవాల్‌

సోనియా ఈజ్‌ బ్యాక్‌

ఇక కశ్మీర్‌ వధువులను తెచ్చుకోవచ్చు

ఇస్రో తదుపరి లక్ష్యం.. సూర్యుడు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బర్త్‌డే రోజూ షూటింగ్‌లో బిజీబిజీ..

కొత్త లుక్‌లో థ్రిల్‌

అనుకోని అతిథి

ఫోరెన్సిక్‌ పరీక్షల నేపథ్యంలో...

ఏడేళ్ల తర్వాత?

కొత్తగా చేయటం నాన్న నుంచి నేర్చుకున్నా