కారులో హెల్మెట్ పెట్టుకోనందుకు ఫైన్! | Sakshi
Sakshi News home page

కారులో హెల్మెట్ పెట్టుకోనందుకు ఫైన్!

Published Sun, May 31 2015 1:36 AM

కారులో హెల్మెట్  పెట్టుకోనందుకు ఫైన్! - Sakshi

నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోనందుకు ఫైన్ వసూలు చే స్తాడు తెలుగు సినిమాలో ఓ ట్రాఫిక్ పోలీసు. కానీ నిజంగానే ఓ పోలీసు ఇలాంటి పనే చేశాడు. కా రు నడుపుతూ హెల్మెట్ పెట్టుకోనందుకు ఫైన్ వేసేశాడు! గత శనివారం మీరట్‌లో ఈ చోద్యం జరిగింది. శైలేందర్ సింగ్ అనే వ్యక్తి తన కుమారుడికి వంట్లో బాగాలేకపోవడంతో మారుతి స్విఫ్ట్ కారులో డాక్టర్ దగ్గరికి బయలుదేరాడు. ఇంతలో ట్రాఫిక్ పోలీసు శివరాజ్ సింగ్ ఆపాడు.

శైలేందర్ పత్రాలన్నీ చూపించాడు. అన్నీ సరిగ్గానే ఉన్నాయి. కానీ చేతిని తడపందే వదలకూడదనుకున్నాడో ఏ మో.. వాదులాటకు దిగాడు పోలీసు. ఆలస్యమవుతుండటంతో శైలేందర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసుకు మండిపోయింది. ఇంకేం.. హెల్మెట్ పెట్టుకోలేదంటూ చలానా రాసి చేతిలో పెట్టాడు. చలానాలో కారు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా రాశాడు. శైలేందర్ దీనిపై స్థానిక ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు మొదలైంది. అయితే.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినందుకే శైలేందర్‌కు చలానా రాశానని, కానీ పొరపాటున హెల్మెట్ పెట్టుకోనట్లు పే ర్కొన్నానని శివరాజ్ సమాధానం చెప్పుకున్నాడు. అయినా.. ఇది చాలా చిన్న విషయమని, మీడియా అనవసరంగా ఎక్కువ చేసి చూపిందనీ సెలవిచ్చాడు.
 

Advertisement
Advertisement