Sakshi News home page

బోస్ పరిశోధన సంస్థలో అగ్నిప్రమాదం

Published Sun, Nov 1 2015 5:11 PM

Fire at Bose Institute in WB Kolkata

కోల్కతా తూర్పు ప్రాంతంలోని రాజా బజార్లో గల బోస్ పరిశోధన సంస్థలో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సంస్థలో గల మైక్రోబయాలజీ ల్యాబ్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ 1917లో బోస్ పరిశోధన సంస్థను స్థాపించారు. విఙ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పలు విభాగాలలో ఇక్కడ పరిశోధనలు నిర్వహిస్తారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement