500 కిలోమీటర్లు.. 2 గంటల్లో వెళ్లిపోవచ్చు! | Sakshi
Sakshi News home page

500 కిలోమీటర్లు.. 2 గంటల్లో వెళ్లిపోవచ్చు!

Published Fri, May 27 2016 12:20 PM

500 కిలోమీటర్లు.. 2 గంటల్లో వెళ్లిపోవచ్చు!

న్యూఢిల్లీ: దేశంలో తొలి బుల్లెట్‌రైలు 2023 నాటికి పట్టాలెక్కుతుందని రైల్వే మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. భారత ఉపఖండ  రైల్వేల్లో ఇది మైలురాయిగా నిలుస్తుందన్నారు. ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య అండర్ సీ టన్నెల్ లో ఈ బుల్లెట్‌రైలు పరుగు తీయనుంది. దీని గరిష్ట వేగం 350 కి.మీ కాగా, నిర్వహణా వేగాన్ని 320 కి.మీకి తగ్గించారు. దీని ద్వారా ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య 508 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లోపు చేరుకోవచ్చు.

నిర్మాణ పనులు 2018లో మొదలయ్యే అవకాశం ఉంది. రూ. 97,636 కోట్లతో ఈ ప్రాజెక్టును పట్టాలకెక్కించనున్నారు. ఇందులో 81 శాతం నిధులను జపాన్ నుంచి తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఈ మొత్తాన్ని 0.1 శాతం వార్షిక వడ్డీతో 50 ఏళ్లలో తిరిగి చెల్లించనున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను జపనీస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ(జేఐసీఏ) తయారు చేసిందని తెలిపారు.

Advertisement
Advertisement