కోల్‌కతాలో 3డీ ప్రింటెడ్ దుర్గామాత! | Sakshi
Sakshi News home page

కోల్‌కతాలో 3డీ ప్రింటెడ్ దుర్గామాత!

Published Tue, Sep 9 2014 3:56 AM

కోల్‌కతాలో 3డీ ప్రింటెడ్ దుర్గామాత! - Sakshi

కోల్‌కతా: విజ్ఞానాన్ని, కళను మేళవిస్తూ 3డీ ప్రింటెడ్ టెక్నాలజీ ద్వారా కాగితంతో రూపొందించిన వినూత్న దుర్గామాత విగ్రహం తొలిసారిగా కోల్‌కతాలో పూజలు అందుకోనుంది.  3డీ ప్రింటింగ్ టెక్నాలజీని దుర్గామాత విగ్రహం తయారీకి కూడా వాడుకోవడం ఇదే తొలిసారని దక్షిణ కోల్‌కతాలోని జోధ్‌పూర్ పార్కు దుర్గా పూజా కమిటీ వెల్లడించింది. దుర్గ విగ్రహాలను మట్టితో చేతులతోనే రూపొందించడం సంప్రదాయం. అయితే తాము 8.5 అంగుళాల పొడవు, 14 అంగుళాల వెడల్పు ఉన్న ఈ విగ్రహాన్ని కంప్యూటర్‌లో డిజిటల్ డిజైన్లు, శిల్పకళ అప్లికేషన్ల సాయంతో 3డీ ప్రింటర్ ద్వారా సృష్టించామని ‘ప్రింట్జ్ వరల్డ్‌వైడ్’ డెరైక్టర్ ఉజ్జల్ మిత్ర తెలిపారు. ఇలాంటి 3డీ ప్రింటింగ్ విగ్రహం తయారీకి ప్రస్తుతం రూ.60 వేలు ఖర్చవుతుందన్నారు.

Advertisement
Advertisement