మోదీకి జిన్‌పింగ్ ఆహ్వానం
బీజింగ్: ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్ నుంచి భారత పర్యటనను ప్రారంభించిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అందుకు ప్రతిగా మోదీని సైతం తన సొంత పట్టణం జియాన్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు. మోదీతో బుధవారం జరిగిన సమావేశంలో జిన్‌పింగ్ ఈ ఆహ్వా నం చేసినట్లు చైనా అధికార మీడియా పేర్కొంది.
కోట్నీస్ కుటుంబానికి పరామర్శ
తమ దేశం కోసం ప్రాణాలర్పించిన భారత వైద్యుడు ద్వారకానాథ్ కోట్నీస్ కుటుంబ సభ్యులను భారత పర్యటనలో భాగంగా కలిసే చైనా నేతల ఆనవాయితీని జిన్‌పింగ్ కొనసాగించారు. వయోభారం కారణంగా చక్రాల కుర్చీకే పరిమితమైన డాక్టర్ కోట్నీస్ సోదరి మనోరమ (93)ను జిన్‌పింగ్ శుక్రవారం ఢిల్లీలో పరామర్శించా రు. జిన్‌పింగ్ ఆమెను కలిసేందుకు వీలుగా ముంబైలోని చైనా కాన్సులేట్ జనరల్ ఆమెను ప్రత్యేకంగా విమానంలో ఢిల్లీ తీసుకొచ్చారు. రెండో చైనా-జపాన్ యుద్ధంలో గాయపడ్డ చైనా సైనికులకు చికిత్స అందించేందుకు 1937లో వచ్చిన భారత వైద్య బృందంలో ఒకరైన డాక్టర్ కోట్నీస్ 1942 వరకూ వైద్యం అందిస్తూ అనారోగ్యానికి గురై కన్నుమూశారు.
జిన్‌పింగ్‌ను కలిసిన సోనియా, మన్మోహన్సింగ్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లు శుక్రవారం ఢిల్లీలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఆయన బస చేసిన ఓ హోటల్లో కలిశారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.
యోగా నేర్చుకుంటున్న జిన్‌పింగ్ భార్య
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భార్య పెంగ్ లియువాన్ యోగా నేర్చుకుంటున్నారట. తమ దేశంలో యోగా ఎంతో ప్రజాదరణ పొందుతోందని...తన భార్య యోగా నేర్చుకుంటోందంటూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో జిన్‌పింగ్ తెలిపారు.
చుమర్‌లో మళ్లీ చైనా చొరబాట్లు
ఈశాన్య లడఖ్‌లోని చుమర్ ప్రాంతంలోని భారత భూభాగం నుంచి వెనక్కు వెళ్లి కొన్ని గంటలైనా గడవకముందే.. చైనా సైనికులు మరోసారి అదేప్రాంతంలో భారతభూభాగంలోకి చొచ్చుకువచ్చారు. 35 మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను దాటి.. దగ్గర్లోని ఒక పర్వతంపైకి చేరారని శుక్రవారం అధికార వర్గాలు వెల్లడించాయి. మరో 300 మంది సైనికులు చైనా వైపు, ఎల్ఏసీకి దగ్గరలో కనిపిస్తున్నారని తెలిపాయి.
నా సొంతూరుకు రండి
Published Sat, Sep 20 2014 5:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
Lok Sabha Polls: మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement