‘తొలిసారి నిజాయితీప‌రుల‌కు గౌరవం’ | Sakshi
Sakshi News home page

‘తొలిసారి నిజాయితీప‌రుల‌కు గౌరవం’

Published Wed, Nov 16 2016 1:12 PM

‘తొలిసారి నిజాయితీప‌రుల‌కు గౌరవం’ - Sakshi

న్యూఢిల్లీ: అవినీతి, నల్లధనంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోరాటం చేస్తున్నారని కేంద్రమంత్రి పియూష్ గోయల్ అన్నారు. పెద్ద నోట్ల రద్దుపై రాజ్యసభలో బుధవారం చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తొలిసారి దేశంలో నిజాయితీప‌రుల‌కు గౌర‌వం ద‌క్కింద‌న్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని దేశం మొత్తం స్వాగతిస్తోందని, అవినీతిప‌రులు, ఉగ్ర‌వాదుల‌కు వ్య‌తిరేకంగా  పోరాటం చేస్తున్న ప్ర‌ధాని మోదీ నిర్ణయాన్ని అన్ని పార్టీలు ప్రధాని గౌరవించాలన్నారు.
 
సరైన సమయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని పియూష్ గోయల్ అన్నారు. దేశంలో నిజాయితీపరులకు పండుగ అని ఆయన పేర్కొన్నారు. అవినీతిపరులు, నల్లధనంపైనే తమ యుద్ధమన్నారు. నోట్ల ర‌ద్దును తాము స‌ర్జిక‌ల్ దాడిగా పోల్చ‌లేద‌ని, ఒక‌వేళ న‌ల్ల‌ధ‌నం, అవినీతి, ఉగ్ర‌వాదంపై ఈ చ‌ర్య‌ను స‌ర్జిక‌ల్ దాడిగా భావిస్తే అదో స‌ర్టిఫికెట్‌గా అంగీక‌రిస్తామ‌న్నారు.  కొన్ని సిరీస్ నోట్లు చెలామణిలో లేవని, ఆ నోట్లను ఎక్కడ దాచిపెట్టారని పియూష్ ప్రశ్నించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement