'గవర్నర్ నన్ను బెదిరించారు' | Sakshi
Sakshi News home page

'గవర్నర్ నన్ను బెదిరించారు'

Published Fri, Jan 29 2016 9:00 PM

'గవర్నర్ నన్ను బెదిరించారు' - Sakshi

న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి నబమ్‌టుకీ, గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్‌ఖోవాల మధ్య వివాదం రోజు రోజుకు పెరుగుతోంది. గవర్నర్ పదవి చేపట్టిన నాటి నుంచి రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని నబమ్‌టుకీ అన్నారు. తన సహచర మంత్రులతో ఇటానగర్లోని రాజ్ భవన్లో గవర్నర్ను కలవడానికి వెళ్లినప్పుడు అవమానించారని తెలిపారు. మీటింగ్లో గవర్నర్ బెదిరింపులకు పాల్పడుతూ దుషించారని తెలిపారు. మీటింగ్కు వస్తున్నప్పుడ, జరుగుతున్న సమయంలో తమకు తెలియకుండా వీడియో కూడా తీశారని ఆరోపించారు. అయితే బయటకు వచ్చిన వీడియో ఫూటేజీ ఎడిటి చేసిందని తెలిపారు. తనను రెచ్చగొట్టే మాటలను ఆ వీడియోనుంచి తొలగించారన్నారు.   

అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన ప్రకటించటాన్ని సవాల్ చేస్తూ నబమ్‌టుకీ గురువారం తాజా పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనితో పాటు.. కాంగ్రెస్ శాసనసభాపక్ష చీఫ్ విప్ రాజేశ్ టాచో వంటి వారు వేసిన పిటిషన్లను జస్టిస్‌జె.ఎస్.ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం విచారణకు స్వీకరించే అవకాశముంది. ఇంతకుముందు వేసిన పిటిషన్లు రాష్ట్రపతి పాలనను ప్రశ్నించలేదని.. రాష్ట్రపతి పాలన విధించటానికి ముందే వాటిని దాఖలు చేశారని కేంద్రం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో..పిటిషన్ల సవరణకు ధర్మాసనం అవకాశం ఇవ్వగా నబమ్‌టుకీ తాజాపిటిషన్ వేశారు.
 

Advertisement
Advertisement