ఇండియాలో వాట్సాప్‌.. 4 సర్‌ప్రైజ్‌ అంశాలు | Sakshi
Sakshi News home page

ఇండియాలో వాట్సాప్‌.. 4 సర్‌ప్రైజ్‌ అంశాలు

Published Mon, May 8 2017 8:06 PM

ఇండియాలో వాట్సాప్‌.. 4 సర్‌ప్రైజ్‌ అంశాలు

ప్రపంచ వ్యాప్తంగా నెలకు 1.2బిలియన్ల మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. కాగా, ఒక్క భారత్‌లోనే నెలకు 160 మిలియన్ల మంది ఈ యాప్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. ఒక్క చాటింగ్‌ యాప్‌గానే కాకుండా మరింత వేగవంతంగా సమాచారం చేరవేసేలా సహాయపడుతున్నా ఈ యాప్‌ను భారత్‌లో అధికంగా సామాజిక ప్రయోజనాలకోసమే ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా అధికారులు ప్రజలతో మమేకమయ్యేందుకు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

వాటిల్లో కొన్ని ఉదాహరణలు చూస్తే.. ఈ యాప్‌ ద్వారా ప్రస్తుతం ఢిల్లీలో మహిళల భద్రతకు పెద్ద డ్రైవ్‌నే నిర్వహిస్తున్నారు. వారు ఏ వాహనాన్ని ఎక్కుతున్నారో దానిని వెంటనే ఓ ఫొటో తీసి పంపిస్తే దాని ద్వారా వారిపై ఎలాంటి దాడులు జరిగినా వెంటనే గుర్తించే వీలయ్యేలా ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో మహిళలు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటున్నారు. అలాగే, ప్రస్తుతం ఎన్నో నగరాలు  నేరాల ఫిర్యాదులకు వాట్సాప్‌ను ప్రారంభించగా ఊహించని విధంగా వారికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక కేరళలో అయితే తప్పుచేసే ప్రభుత్వ అధికారులపై నేరుగా ఫిర్యాదు చేసేలా ఒక యాప్‌ను ప్రారంభించారు. అలాగే, అత్యవసర సమయాల్లో కూడా ఇండియాలో వాట్సాప్‌ ద్వారా శరవేగంగా స్పందిస్తున్నారు.

Advertisement
Advertisement