ఇరు రాష్ట్రాలకు నిధుల సిఫారసులు చేయండి | Sakshi
Sakshi News home page

ఇరు రాష్ట్రాలకు నిధుల సిఫారసులు చేయండి

Published Tue, Jun 3 2014 1:48 AM

Funds Recommendations to be declared for Two states

14వ ఆర్థిక సంఘానికి రాష్ట్రపతి ఉత్తర్వులు
విభాజ్యనిధి నుంచి తెలంగాణకు నిధుల పంపిణీ

 
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఉనికిలోకి వచ్చినందున కేంద్ర విభాజ్య నిధి నుంచి నిధులు పంపిణీ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. 13వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర విభాజ్య వాటా నుంచి రాష్ట్రాలకు నిధులను ప్రతి నెలా మొదటి పని దినం రోజు కేటాయిస్తారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనందున ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రానికి వచ్చే నిధుల్లో తెలంగాణ వాటాను పంచి ఇకపై ఆ నిధులు కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 ద్వారా ఏర్పడిన రెండు రాష్ట్రాలకూ ఆయా రాష్ట్రాల వనరులను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ఆర్థిక సాయానికి తగిన సిఫారసులు చేయాలని సూచిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది జనవరి 2న ఆంధ్రప్రదేశ్‌కు సిఫారసులు చేయాలన్న ఉత్తర్వుల్లో ఈమేరకు సవరణ చేశారు.

Advertisement
Advertisement