సోషల్ మీడియాలో సీఎంకు చేదు అనుభవం! | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాలో సీఎంకు చేదు అనుభవం!

Published Fri, Feb 24 2017 6:44 PM

సోషల్ మీడియాలో సీఎంకు చేదు అనుభవం! - Sakshi

పనాజి: సోషల్ మీడియాలో సామాన్య వ్యక్తులే కాదు ప్రజా ప్రతినిధులు, పెద్ద హోదాల్లో ఉన్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఓ సీఎంకు ఎదురైంది. గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ నిన్న (గురువారం) ఫేస్ బుక్ లో చేసిన పోస్టుపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఆయనపై కామెంట్ల పర్వం కొనసాగగా, చివరకు సీఎం ఆ పోస్టును ఎడిట్ చేయాల్సి వచ్చింది.

గోవా అసెంబ్లీకి ఈ నెల 4న ఎన్నికలు జరిగాయి కదా.. అయితే ఎన్నికలు ముగియడంతో ఎంతో ప్రశాంతంగా ఉన్నానంటూ స్విమ్మింగ్ పూల్ లో సేదతీరుతున్న విషయాన్ని తెలియజేసేలా ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశారు. 'ఎన్నికల తర్వాత రిలాక్స్ అవుతున్నాను. ఎవరో గెస్ చేయండి. ఎక్కడో చెప్పుకోండి' అని పోస్ట్ చేస్తూ ఓ ఫొటో కూడా అప్ లోడ్ చేశారు. నెటిజన్లు కొందరు సీఎం పోస్ట్ పై స్పందిస్తూ.. 'త్వరలో శాశ్వతంగా రిలాక్స్ అవుతారులే (పదవి పోతుంది)' అని కామెంట్ చేశారు. దీంతో సీఎం పర్సేకర్ తన ఎఫ్బీ పోస్ట్ ను 'కమ్యూనింగ్ విత్ నేటర్. ఏ రిఫ్రెషింగ్ ఎక్స్ పీరియన్స్. గెస్ హూ. గెస్ వేర్ (ప్రకృతితో కమ్యూనికెట్ అవుతున్నాను. రిఫ్రెష్ అవుతున్నాను. ఎవరో చెప్పుకోండి.. ఎక్కడో చెప్పుకోండి)' అని మార్పు చేశారు.

Advertisement
Advertisement