గోవా తొలి మహిళా సీఎంకు స్వైన్ ఫ్లూ | Sakshi
Sakshi News home page

గోవా తొలి మహిళా సీఎంకు స్వైన్ ఫ్లూ

Published Tue, Mar 24 2015 8:04 PM

Goa first woman CM down with swine flu

గోవా మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి శశికళా కకోద్కర్ స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా తెలిపారు. 80 ఏళ్ల కకోద్కర్ 1977లో గోవా ముఖ్యమంత్రిగా పని చేశారు.

ఆమెను నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. గోవాలో గత రెండు మూడు వారాల్లో స్వైన్ ఫ్లూ కారణంగా ముగ్గురు మరణించారు. గోవా మొదటి ముఖ్యమంత్రి దయానంద్ బందోద్కర్ కుమార్తె శశికళ. ఈమె ఈ రాష్ట్రానికి తొలి మహిళా సీఎంగా వ్యవహరించారు.

Advertisement
Advertisement