ఘనవ్యర్థాల నిర్వహణకు ‘గోబర్‌ ధన్‌’ | Sakshi
Sakshi News home page

ఘనవ్యర్థాల నిర్వహణకు ‘గోబర్‌ ధన్‌’

Published Fri, Feb 2 2018 5:01 AM

 Gobar Dhan scheme to convert cattle dung into bio fuel announced - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్‌ మిషన్‌’కింద 2 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అలాగే ఘనవ్యర్థాల నిర్వహణ కోసం గోబర్‌–ధన్‌ అనే పేరుతో కొత్త పథకాన్ని ప్రతిపాదించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరిన్ని మరుగుదొడ్లు నిర్మిస్తామని గురువారం లోక్‌సభలో బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద ఇప్పటికే 6 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించినట్లు జైట్లీ పేర్కొన్నారు.

దీంతో దేశంలోని మహిళల గౌరవం, బాలికల విద్య.. మొత్తంగా కుటుంబ ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పారు. భారత్‌ను బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా మార్చే లక్ష్యంలో భాగంగా గోబర్‌–ధన్‌ (గాల్వనైజింగ్‌ ఆర్గానిక్‌ బయో–ఆగ్రో రిసోర్సెస్‌ ధన్‌) కార్యక్రమాన్ని ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పశువుల పేడ, ఘన వ్యర్థాలను కంపోస్ట్, ఎరువులు, బయోగ్యాస్‌లా మార్చడంలో తోడ్పడుతుందని పేర్కొన్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement