'వైదిక్ దేశంలో ఉండటానికి అనర్హుడు' | Sakshi
Sakshi News home page

'వైదిక్ దేశంలో ఉండటానికి అనర్హుడు'

Published Wed, Jul 16 2014 3:29 PM

'వైదిక్ దేశంలో ఉండటానికి అనర్హుడు'

న్యూఢిల్లీ: ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు హఫీజ్‌ సయీద్ ను వేద్ ప్రతాప్ వైదిక్ కలవడంపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. హఫీజ్ ను కలిసిన  వైదిక్ భారత్‌లో ఉండటానికి అనర్హుడు అని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యలు చేశారు. దేశద్రోహులను కలిసిన వారిపై మోడీ ప్రభుత్వం సానుకూలత చూపవద్దని ఉద్దవ్ విజ్క్షప్తి చేశారు. 
 
దేశద్రోహులతో సంబంధాలు ఉన్నవారు ఎవరైనా ఈ దేశంలో ఉండటానికి అనర్హులని  ఉద్ధవ్‌ థాక్రే తీవ్రంగా స్పందించారు. హఫీజ్ ను వైదిక్ కలవడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అయితే లష్కరే తోయిబా చీఫ్‌, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను జర్నలిస్టుగా మాత్రమే కలిశానని వేద్ ప్రతాప్ వైదిక్ స్పష్టం చేశారు. 
 

Advertisement
Advertisement