ఫీజు ఎంతో వైద్యానికి ముందే చెప్పాలి | Sakshi
Sakshi News home page

ఫీజు ఎంతో వైద్యానికి ముందే చెప్పాలి

Published Tue, Feb 7 2017 5:41 PM

ఫీజు ఎంతో వైద్యానికి ముందే చెప్పాలి - Sakshi

న్యూఢిల్లీ: రోగి చికిత్సకయ్యే వ్యయాన్ని ముందుగానే వైద్యుడు వెల్లడించాలని కేంద్రం స్పష్టం చేసింది. చికిత్స తర్వాత ఫీజుల వివరాలు చెబుతామనటం సరికాదని తెలిపింది.

ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ నిబంధనలు-2002 ప్రకారం ఫీజుతోపాటు చికిత్సకు అయ్యే ఖర్చు వివరాలను ఆస్పత్రులు స్పష్టంగా చెప్పాలని సూచించింది. వైద్యులు సేవలు అందించటానికంటే ముందుగానే తాము అందించే సేవలు, రుసుము వివరాలను తప్పనిసరిగా రోగికి గానీ, వారి కుటుంబీకులకు గానీ వెల్లడించాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఫగన్‌ సింగ్‌ కులస్తే మంగళవారం రాజ్యసభలో లిఖిత పూర్వకంగా తెలిపారు.
 

Advertisement
Advertisement