అయోధ్య తీర్పు: వారిదే ఘనత

9 Nov, 2019 12:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పును ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త, రామ జన్మభూమి రథయాత్రలో కీలక పాత్రధారి కేఎన్‌ గోవిందాచార్య స్వాగతించారు. ఈ కేసులో తీర్పు తమకు అనుకూలంగా రావడానికి విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) నేత అశోక్‌ సింఘాల్‌, ఎల్‌కే అద్వానీ చేసిన కృషే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ‘సుప్రీంకోర్టు తుది తీర్పు చాలా సంతోషం కలిగించింది. ఇక మూడు నెలల్లో రామమందిరం నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాల’ని ఆయన అన్నారు. ప్రజలంతా సంయమనంతో మెలగాలని, మత సామరస్యం పాటించాలని కోరారు. ఈ విజయానికి ప్రధాన కారణం ఎవరు అనుకుంటున్నారని ప్రశ్నించగా.. ‘ఆలయ నిర్మాణం కోసం లక్షలాది మంది త్యాగాలు చేశారు. చాలా మంది అనేక రకాలుగా రామ జన్మభూమి ఉద్యమంలో తమ పాత్ర పోషించారు. కీలక​ భూమిక​ మాత్రం అశోక్‌ సింఘాల్‌, ఎల్‌కే అద్వానీదే’ అని సమాధానం ఇచ్చారు.  

అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమని హిందూ మహాసభ తరపు న్యాయవాది వరుణ్‌కుమార్‌ సిన్హా వ్యాఖ్యానించారు. భిన్నత్వంలో ఏకత్వం సందేశాన్ని ఇచ్చేలా తీర్పు ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు బాలెన్స్‌డ్‌గా ఉందని, ఇది ప్రజల విజయమని రామ్‌ లల్లా తరపు న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ అన్నారు. (చదవండి: సుప్రీంతీర్పును గౌరవిస్తున్నాం.. కానీ)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా