‘అన్ని బ్యాంకులు 31లోగా పూర్తి చేయాలి​’ | Sakshi
Sakshi News home page

‘అన్ని బ్యాంకులు 31లోగా పూర్తి చేయాలి​’

Published Wed, Mar 1 2017 5:56 PM

‘అన్ని బ్యాంకులు 31లోగా పూర్తి చేయాలి​’ - Sakshi

న్యూఢిల్లీ: తమ బ్యాంకుల్లోని ఖాతాదారులకు మార్చి 31లోగా మొబైల్‌ బ్యాంకింగ్‌ సౌకర్యం అందించాలని అన్ని బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్‌ లావాదేవీలకు మరింత ఊపునిచ్చే ఉద్దేశంతో ఈ పనిని సత్వరంగా వేగిరం చేయాలని స్పష్టం చేసింది. ‘మొబైల్‌ను కలిగి ఉన్న ప్రతి ఒక్క బ్యాంకు ఖాతాదారుడికి మొబైల్‌ బ్యాంకింగ్‌ సౌకర్యం అందించాలి. ఇందుకోసం మార్చి 31వరకు దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలి’ అని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ సెక్రటరీ అరుణా సుందరరాజన్‌ బుధవారం విలేకరులకు చెప్పారు.

‘వాస్తవానికి ప్రారంభ సమయంలో మొబైల్‌ బ్యాంకింగ్‌కు పెద్దగా ప్రాధాన్యం లేదు. కానీ, తర్వాత పలువురు కస్టమర్లు తమకు మొబైల్‌ బ్యాంకింగ్‌ సౌకర్యాలు కావాలని, ఆ మేరకు బ్యాంకులను ఆదేశించాలంటూ మాకు విజ్ఞప్తులు చేస్తున్నారు. అది తప్పకుండా చేయాల్సిన పని. ఇది ఇప్పటికే ప్రారంభమైనా పెద్దగా బ్యాంకులు స్పందించడం లేదని తెలిసింది. అందుకే మార్చి 31లోగా మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలు ప్రతి ఒక్క బ్యాంకు ఖాతాదారుడికి అందించాలి’  అని ఆమె ఆదేశించారు.

Advertisement
Advertisement