రాష్ట్రపతి భవన్లో జీ జిన్పింగ్కు ఘన స్వాగతం | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి భవన్లో జీ జిన్పింగ్కు ఘన స్వాగతం

Published Thu, Sep 18 2014 10:06 AM

రాష్ట్రపతి భవన్లో జీ జిన్పింగ్కు ఘన స్వాగతం - Sakshi

న్యూఢిల్లీ : మూడు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన  చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ గురువారం రాష్ట్రపతి భవన్లో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. రెండోరోజు పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ఉదయం రాష్ట్రపతి భవన్ సందర్శించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ....చైనా అధ్యక్షుడిని సాదరంగా ఆహ్వానించి కరచాలనం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జీ జిన్పింగ్ రాష్ట్రపతిభవన్‌లో మీడియా ద్వారా మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య ప్రస్తుతం జరిగే చర్చలతో స్నేహబంధం మరింత బలపడుతుందన్నారు. అందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. చైనా-భారత్ దేశాల సాంస్కృతిక బంధానికి వేల ఏళ్ల చరిత్ర ఉందన్నారు. కాగా భారత్ భూభాగంలో చైనా చొరబాట్లుపై ప్రధాని మోడీ గతరాత్రి జిన్పింగ్తో చర్చించినట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.

ఈరోజు  ఉదయం 11 గంటలకు హజ్ హౌస్‌లో ప్రధాని మోడీతో జిన్‌పింగ్ భేటీ కానున్నారు. సమావేశంలో అనేక అంశాలపై భారత్ - చైనా దౌత్య బృందాలు కీలక చర్చలు జరపనున్నాయి. ఆర్థిక, వాణిజ్య బంధాల బలోపేతంగా చర్చలు జరగనున్నాయి. సరిహద్దు వివాదము చర్చకు వచ్చే అవకాశం ఉంది. జిన్‌పింగ్... విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మరోసారి చైనా చొరబాట్లపై చర్చించే అవకాశం ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement