గుజరాత్లో హై ఎలర్ట్ | Sakshi
Sakshi News home page

గుజరాత్లో హై ఎలర్ట్

Published Sun, Mar 6 2016 9:37 AM

గుజరాత్లో హై ఎలర్ట్

అహ్మదాబాద్: పాకిస్తాన్ నుంచి 10 మంది ఉగ్రవాదులు చొరబడ్డారని అనుమానిస్తున్నట్టుగా కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా తీర ప్రాంతంలోనూ, కచ్ జిల్లాలోనూ మరింత భద్రతను పెంచింది. పాక్ భూభాగం లేదా సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు వచ్చి ఉంటారని భావిస్తున్నారు. భద్రతను కట్టుదిట్టం చేయాల్సిందిగా జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ గుజరాత్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెండు ఎన్ఎస్జీ బృందాలు గుజరాత్కు చేరుకున్నాయి.

కచ్ తీర ప్రాంతంలో గత మూడు నెలల కాలంలో పాక్ నుంచి అక్రమంగా చొచ్చుకొచ్చిన ఐదు మత్స్యకారుల పడవలను భారత భద్రత అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించి భద్రత బలగాలు కేంద్రానికి నివేదిక సమర్పించాయి. అజిత్ దోవల్ సూచన మేరక రాష్ట్రంలో కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని ఓ అధికారి చెప్పారు. గుజరాత్ అదనపు ప్రధాన కార్యదర్శి పీకే తనేజా శనివారం పోలీసు, రక్షణ, ఐబీ, పారామిలటరీ బలగాల అధికారులతో సమావేశమయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement