గుజరాతీ రచయిత రఘువీర్ చౌదరికి జ్ఞానపీఠ్ అవార్డు

29 Dec, 2015 17:56 IST|Sakshi
గుజరాతీ రచయిత రఘువీర్ చౌదరికి జ్ఞానపీఠ్ అవార్డు

న్యూఢిల్లీ: ప్రముఖ గుజరాతీ రచయిత రఘువీర్ చౌదరికి  దేశ సాహిత్య రంగంలోనే అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డు వరించింది. 2015 సంవత్సరానికిగాను ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు. జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన వారిలో రఘువీర్ చౌదరి 51వ వారు. ప్రముఖ రచయిత, జ్ఞాన్‌పీఠ్ సెలెక్షన్ బోర్డు చైర్మన్‌ సురంజన్ దాస్‌ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన బోర్డు ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ఈ సమావేశంలో బోర్డు సభ్యులు ప్రొఫెసర్ షమిమ్ హనిఫ్‌, హరీశ్ త్రివేది, రామకాంత్‌ రాత్‌, చంద్రకాంత్ పాటిల్, అలోక్‌రాయ్‌, దినేశ్‌మిశ్రా, లీలాధర్ మంద్లోయి పాల్గొన్నారు.ఆయన గుజరాతీలో పలు రచనలు చేశారు. రఘువీర్ చౌదరి గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు.

గుజరాతీ సాహిత్యానికి వన్నె తెచ్చిన రచయిత
1938లో జన్మించిన రఘువీర్‌ చౌదరికి గుజరాతీ సాహిత్యంలో ప్రత్యేక స్థానముంది. నవలాకారుడిగా, కవిగా, విమర్శకుడిగా గుజరాతీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ వ్యక్తి ఆయన. ఆయన ప్రభావం ఎంతోమంది గుజరాతీ రచయితలపై ఉంది. గోవర్ధన్‌రాం త్రిపాఠి, కాకా కలేల్కర్, సురేశ్ జోషి, రామాదర్శ మిశ్రా, జీఎన్‌ డిక్కీ వంటి రచయితలు ఆయన రచనలతో ప్రభావితమైన వాళ్లే. భావవ్యక్తీకరణ గంభీరత, అర్థవంతమైన ఉపమాలు, ప్రతీకల ప్రయోగం రఘువీర్‌ కవిత్వంలో ప్రముఖంగా కనిపిస్తుంది.

కవిత్వమే ఆయనకు అత్యంత ప్రీతికరమైనదైనా.. నవలా సాహిత్యంలో నిరంతర అన్వేషి ఆయన.  మానవ జీవిత నిత్య ప్రవర్ధమాన కార్యకలాపాలను ప్రగతిశీల దృక్పథంతో బలోపేతం చేయడం ఆయన దృక్పథంగా కనిపిస్తుంది. ఆయన నవలలు 'అమృత', 'వేణు వాత్సల', 'ఉపర్వస్‌' త్రయంలో ఇదే దృక్పథం ప్రతిధ్వనిస్తుంది. ఆయన రచించిన 'రుద్ర మహాలయ' గుజరాతీ సాహిత్యంలోనే విఖ్యాత రచనగా నిలిచిపోయింది. సృజనాత్మక రచించడం, విభిన్నంగా ఆలోచనను ఆవిష్కరించే విషయంలో ఆయన రాసిన వ్యాసాలు ఆయన సునిశిత దృష్టిని చాటుతాయి.

 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తెలుసా.. మనసా.. తెలుగు పాట పాడిన బీజేపీ నేత

మహిళపై సామూహిక అత్యాచారం

మోదీ వెబ్‌ సిరీస్‌ను నిలిపివేయండి: ఈసీ 

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

అటవీ ప్రాంతంలో దారుణం.. మహిళ తలపై..

డింపుల్‌ యాదవ్‌ 30ఏళ్ల రికార్డు!

రాగాలాపన

అంబానీ మద్దతుపై దుమారం

భగినికి విడుదల కష్టాలు

ఎవరికి జిందాబాద్‌?

సంఘ్‌ ఆశీస్సులతో సమరానికి సాధ్వి

‘విశ్వాస’ ఘాతుకం

బలహీన ప్రభుత్వం, బలహీన ప్రధాని

రాహుల్‌ అఫిడవిట్‌పై అనుమానాలు

న్యాయ్‌తో ఆర్థిక వ్యవస్థ పరుగులు

ప్రజ్ఞాకు ఈసీ నోటీసులు

కాంగ్రెస్‌ది ఓటుభక్తి.. మాది దేశభక్తి

ప్రమాదంలో ‘న్యాయ’ స్వతంత్రత

సాధ్వి ప్రజ్ఞ ..రాయని డైరీ

లాలూ భార్య సంచలన వ్యాఖ్యలు

తిరిగి విధుల్లోకి అభినందన్‌!?

ఏం చేద్దాం..మీరే దొంగ ఓట్లు వేసేయండి!

అపూర్వను గుడ్డిగా నమ్మాను : ఎన్డీ తివారి భార్య

‘మోదీ వారికి బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌’

ఆ వెబ్‌సిరీస్‌ స్ట్రీమింగ్‌ ఆపేయండి : ఈసీ

‘రాహుల్ అఫిడవిట్‌లో పొంతన లేని సమాచారం’

సీజేఐ రంజన్‌ గొగోయ్‌పై లైంగిక ఆరోపణల సంచలనం

వైరల్‌ స్టోరి : తండ్రికే పునర్జన్మనిచ్చింది

వస్తువులం కాదు.. మనుషులమే

పట్టాలు తప్పిన హౌరా ఎక్స్‌ప్రెస్

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అక్కడా మీటూ కమిటీ

మరోసారి జోడీగా...

కాపాడేవారెవరు రా?

రాణి పూంగుళలి

గ్యాంగ్‌ వార్‌

నేను నీరులాంటివాడిని