టెఫ్లాన్ తో జుట్టు రాలుతుంది! | Sakshi
Sakshi News home page

టెఫ్లాన్ తో జుట్టు రాలుతుంది!

Published Fri, Dec 30 2016 1:29 AM

టెఫ్లాన్ తో జుట్టు రాలుతుంది! - Sakshi

బెంగళూరు: టెఫ్లాన్ (నాన్ స్టిక్‌ వంట పాత్రలపై పూసే ఒక రకం ప్లాస్టిక్‌)లో ఉండే పీఎఫ్‌ఓఏ (పర్‌ఫ్లూరోఆక్టోనేట్‌ యాసిడ్‌) అనే హానికారక పదార్థం, జుట్టురాలే సమస్య ఉన్న 80 శాతం మంది రక్తంలో కనిపిస్తున్నట్లు బెంగళూరులోని హెయిర్‌లైన్ అంతర్జాతీయ పరిశోధన కేంద్రం ఒక నివేదిక విడుదల చేసింది. పీఎప్‌ఓఏ వల్ల అధిక థైరాయిడిజం, అధిక కొలెస్ట్రాల్, మహిళల్లో పీసీఓడీ (పాలీసిస్టిక్‌ ఓవరియన్  డిసీజ్‌) వంటి సమస్యలు వస్తాయి. కర్ణాటక రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్‌ డా.సచ్చిదానంద్‌ ఈ నివేదికను విడుదల చేశారు.

Advertisement
Advertisement