కీలక బిల్లులపై విపక్షాలను ఎలా ఒప్పించాలి? | Sakshi
Sakshi News home page

కీలక బిల్లులపై విపక్షాలను ఎలా ఒప్పించాలి?

Published Mon, Mar 16 2015 12:59 AM

How to convince the opposition of key bills?

న్యూఢిల్లీ: కీలకమైన భూసేకరణ, బొగ్గు, గనుల బిల్లులను రాజ్యసభలో ఆమోదింపజేసుకోవటం ప్రభుత్వానికి సమస్యగా మారింది. లోక్‌సభలో ఆమోదం పొందిన భూసేకరణ, గనులు బిల్లు, బొగ్గు బిల్లులను రాజ్యసభ ఆమోదించాల్సి ఉంది. వీటికోసం సోమవారం నుంచి రాజ్యసభ సాయంత్రం 7 గంటల తర్వాతా కొనసాగించేందుకు సర్కారు సిద్ధపడింది.

గనుల, బొగ్గు బిల్లులను సవరణల నిమిత్తం సెలెక్ట్ కమిటీకి పంపాలని గతవారం రాజ్యసభ నిర్ణయించింది. కమిటీ ఈ నెల 18 నాటికి.. అంటే తొలి దశ బడ్జెట్ సమావేశాలు ముగియడానికి రెండు రోజుల ముందునివేదిక అందిస్తుంది. బొగ్గు, గనుల ఆర్డినెన్స్‌లు ఏప్రిల్ 5తో రద్దవుతాయి.  భూసేకరణ బిల్లూ ఆ రోజే రద్దవుతుంది. ఆ లోపు వీటి స్థానంలో బిల్లులను పార్లమెంట్ ఆమోదించాలి. ఇందుకోసం ప్రభుత్వం అనధికారికంగా విపక్షాలతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement