'ఇండియాలో ఉన్న పాకిస్థానీ నటులకు నేను వ్యతిరేకం' | Sakshi
Sakshi News home page

'ఇండియాలో ఉన్న పాకిస్థానీ నటులకు నేను వ్యతిరేకం'

Published Wed, Oct 5 2016 2:24 PM

'ఇండియాలో ఉన్న పాకిస్థానీ నటులకు నేను వ్యతిరేకం' - Sakshi

భారతదేశంలో పని చేస్తున్న పాకిస్థానీ నటులకు తాను వ్యతిరేకమని బీజేపీ ఎంపీ, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ హేమమాలిని స్పష్టం చేశారు. తాను నూటికి నూరుశాతం జవాన్లకు మద్దతు పలుకుతానని, వాళ్లు మన దేశం కోసం పోరాడుతూ.. ప్రాణాలు అర్పిస్తున్నారని ఆమె అన్నారు. అంతేతప్ప ఇక్కడ పనిచేస్తున్న పాకిస్థానీ నటులకు మాత్రం మద్దతు పలకనని, జైహింద్ అంటూ ట్వీట్ చేశారు. ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్ల మీద భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఆమె ప్రశంసించారు. సర్జికల్ స్ట్రైక్స్‌తో మన సైన్యం అద్భుతమైన పని చేసిందని, దేశం మొత్తం వాళ్లకు మద్దతుగా నిలవాలని మరో ట్వీట్ చేశారు. దానికి కూడా సాక్ష్యాలు అడగడం ఎందుకని ప్రశ్నించారు.

అయితే.. ఇంతకుముందు మంగళవారం మాత్రం.. పాకిస్థానీ నటుల పనితీరును తాను ప్రశంసిస్తున్నట్లు హేమ మాలిని చెప్పారు. అయితే వాళ్లు భారతదేశంలో పనిచేయడానికి అనుమతించాలా, వద్దా అన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. వాళ్లను నిషేధించాలా వద్దా అని ప్రశ్నించగా.. ఇలాంటి వివాదాస్పదమైన ప్రశ్నలమీద తాను కామెంట్ చేయదలచుకోలేదన్నారు. తామంతా కళాకారులమని, వాళ్లు కూడా అక్కడి నుంచి ఇక్కడకు నటించడానికే వచ్చారని అన్నారు. ఒక నటిగా తాను వాళ్ల పనిని ప్రశంసిస్తాను గానీ, వాళ్లు ఇక్కడ ఉండాలా వద్దా అనే విషయాన్ని మాత్రం చెప్పలేనన్నారు.

 

Advertisement
Advertisement