Sakshi News home page

ఐఐటీలో 'బుల్లెట్' కోర్సు

Published Fri, Jan 9 2015 12:00 PM

ఐఐటీలో 'బుల్లెట్' కోర్సు

కొల్కతా:  ఖరగ్పూర్ ఐఐటీలో బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ కోర్సు ప్రారంభిస్తున్నట్లు ఇన్చార్జ్ ప్రొఫెసర్ సుబ్రన్షు రాయ్ శుక్రవారం కొల్కత్తాలో వెల్లడించారు. ఏ ఏడాది చివరి నాటికి ఈ కోర్సు రూపకల్పన పూర్తి అవుతుందని... ఆ వెంటనే కోర్సును ప్రారంభిస్తామని చెప్పారు. అందుకు భవనాల నిర్మాణం కోసం రైల్వే పరిశధన కేంద్రం (సీఆర్ఆర్) రూ. 20 కోట్లు కేటాయించిందని తెలిపారు. మరో ఆరు నెలలో ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

అలాగే రైల్వే రంగంలో నాలుగు కీలక అంశాలపై కూడా పరిశోధనలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా రైల్వేలో స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు రాయ్ విశదీకరించారు. ఇప్పటికే క్యాంపస్లోని ఐఐటీయన్లు హైస్పీడ్ ట్రైన్ బోగిలో టెక్నాలజీపై పని చేస్తున్నారని తెలిపారు. అలాగే రైల్వే టెక్నాలజీలో పరిశోధన, అభివృద్ధి కోసం రైల్వే శాఖ మరో రూ. 20 కోట్లు మంజురు చేసిందని రాయ్ వెల్లడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement