ఇది ఓ గొప్ప ముందడుగు! | Sakshi
Sakshi News home page

ఇది ఓ గొప్ప ముందడుగు!

Published Thu, Sep 18 2014 5:35 PM

జిన్‌పింగ్‌ - నరేంద్ర మోదీ - Sakshi

12 కీలక ఒప్పందాలపై సంతకాలు
న్యూఢిల్లీ: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత పర్యటన సందర్భంగా భారత్, చైనాల మధ్య 12 కీలక ఒప్పందాలపై అంగీకారం కుదిరింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ 90 నిమిషాలపాటు చర్చలు జరిపారు.  అనంతరం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు.  ఆర్థిక, వాణిజ్య ప్రణాళికలు, రైల్వేల అభివృద్ధి, మానస సరోవర్ మార్గ నిర్మాణం, సమాచార శాఖ తదితర వ్యవహారాలపై ఒప్పందాలు కుదిరాయి.

అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ సరిహద్దు సమస్యల పరిష్కారమే భారత్, చైనా సంబంధాలకు క్షేమకరమన్నారు.  చైనాతో ఐదేళ్ల వాణిజ్య ఒప్పందం గొప్ప ముందడుగని ఆయన  వ్యాఖ్యానించారు. చైనా ప్రధాని జిన్‌పింగ్ మాట్లాడుతూ భారత్-చైనా విస్తృత మార్కెట్ అవకాశాలున్న దేశాలన్నారు. భారత్‌లో హైస్పీడ్ రైళ్ల వ్యవస్థ ఏర్పాటుకు చైనా సహకరిస్తుందని తెలిపారు. వీలైనంత త్వరగా చైనా రావాలని మోదీకి విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉండగా, భారత్ పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సాదర స్వాగతం పలికారు.  త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీకి  జిన్‌పింగ్ దంపతులు నివాళులర్పించారు.
**

Advertisement

తప్పక చదవండి

Advertisement