నమోదైన పార్టీలు 1,866 | Sakshi
Sakshi News home page

నమోదైన పార్టీలు 1,866

Published Mon, Aug 10 2015 10:11 AM

నమోదైన పార్టీలు 1,866 - Sakshi

* గుర్తింపు పొందినవి 56 మాత్రమే
* ఎన్నికల కమిషన్ వెల్లడి
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై 24 నాటికి తమ వద్ద నమోదైన రాజకీయ పార్టీలు మొత్తం 1,866 ఉన్నాయని ఎన్నికల కమిషన్(ఈసీ) వెల్లడించింది. వీటిలో 56 పార్టీలకు మాత్రమే ఈసీ గుర్తింపు ఉంది. ఇందులో ఆరు(బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ)లు జాతీయ పార్టీలు కాగా మిగతావన్నీ ప్రాంతీయ పార్టీలు. 2014 సాధారణ ఎన్నికల సమయంలో అత్యధికంగా 239 పార్టీలు ఈసీ వద్ద తమ పేర్లను నమోదు చేసుకున్నాయి.

గత లోక్‌సభ ఎన్నికల్లో 464 పార్టీలు మాత్రమే ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాయి. ఐదేళ్లుగా ఏదైనా రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం, లేదా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి 4 శాతం ఓట్లు పొందిన పార్టీలకు మాత్రమే ఈసీ గుర్తింపు లభిస్తుంది. గుర్తింపు పొందిన పార్టీలు తమ సొంత గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేయొచ్చు.

గుర్తింపు లేని పార్టీలు ఈసీ వద్ద ఉన్న 84 గుర్తుల్లో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవాలి. మొత్తం పోలై న వాటిలో ఆరో వంతు కన్నా తక్కువ ఓట్లు వస్తే ఆ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయినట్లే. కాగా, లా కమిషన్ న్యాయశాఖకు ఇచ్చిన నివేదికలో పార్లమెంట్, శాసనసభ ఎన్నికల్లో వరుసగా పదేళ్లు పోటీ చేయని పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ప్రతిపాదించింది.

Advertisement
Advertisement