‘మధుమేహంపై ప్రత్యేక దృష్టి పెట్టండి’ | Sakshi
Sakshi News home page

‘మధుమేహంపై ప్రత్యేక దృష్టి పెట్టండి’

Published Wed, Mar 30 2016 2:17 PM

India Must Take Concerted Action to Prevent Diabetes: WHO

న్యూఢిల్లీ: భారత్‌తోపాటు దక్షిణాసియా దేశాల్లో వేగంగా పెరుగుతున్న మధుమేహం కేసులపై ఆయా దేశాల ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిపెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచించింది. 2030 కల్లా ప్రపంచంలో ఎక్కువ మంది చక్కెరవ్యాధి వల్లే ప్రాణాలు కొల్పోతారని వెల్లడించింది.

మధుమేహానికి కారణమవుతున్న ఆహారపు అలవాట్లు, జీవన పరిస్థితులపై ప్రభుత్వాలు వీలైనంత ఎక్కువ ప్రచారం చేయటంతోపాటు.. వ్యాధిని నివారించేందుకు మెరుగైన ఆరోగ్య వసతులు కల్పించాలని సూచించింది. భారత్‌లో 9.6 కోట్ల మందికి మధుమేహం ఉందని.. ఇందులో సగం మందికి తమకు ఈ వ్యాధి ఉన్న విష యం తెలియదని.. ఆగ్నేయాసియా రీజనల్ డెరైక్టర్ ఖేత్రపాల్ సింగ్ తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement