భారత్‌కు అప్పుల తిప్పలు తప్పవు! | Sakshi
Sakshi News home page

భారత్‌కు అప్పుల తిప్పలు తప్పవు!

Published Tue, Jun 30 2020 7:01 PM

India Need More Money To Get Growth Back - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనాను కట్టడి చేయడం కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డైన్‌ కారణంగా బార్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, మాళ్లు మూతపడడం, బస్సులు, రైళ్లు నడవక పోవడం, భవన నిర్మాణాలు నిలిచిపోవడం, పలు రంగాల వ్యాపారాలు మూతపడడం లాంటి పరిణామాల మన్న దేశ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ కారణంగా ప్రభుత్వాలకు పన్ను చెల్లింపులు కూడా బాగా పడిపోతాయి. ఫలితంగా ప్రభుత్వం ఆదాయం బాగా తగ్గుతుంది. వివిధ సంస్థల్లో ప్రభుత్వ వాటాల అమ్మకాల ద్వారా కూడా ఆశించిన సొమ్ము రాదు. ఈ కారణంగా బడ్జెట్‌ కేటాయింపులు పోనూ ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 4.2 లక్షల కోట్ల రూపాయలను మార్కెట్‌ నుంచి అప్పు తీసుకోవాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు. (నవంబర్‌ వరకు ఉచిత రేషన్‌ : మోదీ)

ఆర్థిక పరిస్థితిని మెరగు పర్చుకోవడానికి ప్రజా పనులపై ఖర్చును పూర్తిగా తగ్గించుకోవడం ఒక మార్గమైతే, అప్పు తీసుకోకుండా ప్రభుత్వ ఆస్తులను, కార్పొరేట్‌ సంస్థల్లో ప్రభుత్వ షేర్లను విక్రయించాలని కొంత మంది ఆర్థిక నిపుణులు సూచిస్తుండగా, అప్పులు తీసుకోకుండా కేవలం ఆస్తులను అమ్మడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగు పడదని, అదనపు అప్పులను సేకరించి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టినప్పుడు మంచి ఫలితాలు ఉంటాయని సీనియర్‌ ఆర్థిక నిపుణులు శ్రీజీత్‌ బాల సుబ్రమణియం సూచించారు. 

దేశ జీడీపీలో ద్రవ్యోల్బణం శాతం ఇప్పటికే 4.6 శాతానికి చేరుకున్న నేపథ్యంలో అదనపు అప్పులనేవి మోయలేని భారం అవుతుందని కొంత మంది ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది భారత జనాభాకు రేషన్‌ బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించడం కూడా ఆర్థిక పరిస్థితిపై మరికొంత భారం పడుతుందని వారి అంచనా. ప్రస్తుత పరిస్థితుల్లో భారత ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం రేటు జీడీపీలో 11 శాతానికి చేరుకునే ప్రమాదం ఉందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది. (‘క్వారంటైన్‌ బబుల్‌’ ఓ కొత్త దృక్పథం)

Advertisement

తప్పక చదవండి

Advertisement