ఐఏఎఫ్‌: నమ్మలేని నిజాలు | Sakshi
Sakshi News home page

ఐఏఎఫ్‌: నమ్మలేని నిజాలు

Published Sun, Oct 8 2017 12:49 PM

Indian Air Force amazing facts

ప్రపంచంలోని అత్యుత్తమ వాయుసేన దళాల్లో భారతీయ వాయుసేన ఒకటి. అత్యంత శక్తివంతమైన, నాణ్యమైన, నిపుణులైన పైలెట్లతో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ నిండివుంది. భారతీయ వాయు సేన ఏర్పడి 85 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భారతీయ వాయుసేన గురించి ఆసక్తిర విషయాలు తెలుసుకుందాం.

  • 1933లో భారతీయ వాయుసేన ఏర్పడే నాటికి అందులో కేవలం ఆరు మంది మాత్రమే సుశిక్షుతలైన సిబ్బంది. మరో 19 మంది ఎయిర్‌మెన్లుతో వాయుసేన ఏర్పడింది. మొదట ఐఏఎఫ్‌ వినియోగించిన ఎయిర్‌ క్రాఫ్ట్.. వెస్ట్‌ల్యాండ్‌ వాప్టి ఐఐఏ. ఇవి మొత్తం 4 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి.
  • అదే ఏడాది ఏప్రిల్‌ 1న ఐఏఎఫ్‌ మొదటి స్క్వాడ్రాన్‌ టీమ్‌ను ఏర్పాటు చేసింది.
  • రెండో ప్రపంచ యుద్ధం మొదలైన వెంటనే ఐఏఎఫ్‌ను మరింత బలోపేతం చేశారు. 16 మంది ఉన్నతాధికారులు, 662 మంది సిబ్బంది కీలక అధికారులతో కలిపి మొత్తం 28,500కు బలం చేరింది.
  • 1945లో ఐఏఎఫ్‌కు రాయల్‌ అన్న పేరు వచ్చి చేరింది.
  • 1950 నుంచి ఇప్పటివరకూ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ నాలుగు యుద్ధాల్లో కీలక సేవలు అందించింది.
  •  ప్రస్తుతం ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో 3,4,7,8, 10 స్క్వాడ్రాన్‌ టీములు ఉన్నాయి.
  • 1946లో ఎయిర్‌ఫోర్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ యూనిట్‌ను మొదలు పెట్టింది.
  • ఆపరేషన్‌ విజయ్‌, ఆపరేషన్‌ మేఘధూత్‌, ఆపరేషన్‌ కాక్టస్‌, ఆనపరేషన్‌ పూమాలైలను ఐఎఎఫ్‌ విజయవంతంగా పూర్తి చేసింది.
  • భారతీయ వాయు సేన ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో పలు దేశాల్లో విజయవంతమైన ఆపరేషన్లు నిర్వహించింది. ప్రధానంగా కాంగో ఉద్యమాన్ని అణచడంలో ఐఏఎఫ్‌ పాత్ర అత్యంత కీలకమైంది.

Advertisement
Advertisement