భారత సంతతి శాస్త్రవేత్తకు అమెరికా ప్రెసిడెన్షియల్ అవార్డ్ | Sakshi
Sakshi News home page

భారత సంతతి శాస్త్రవేత్తకు అమెరికా ప్రెసిడెన్షియల్ అవార్డ్

Published Sun, Mar 29 2015 1:13 AM

భారత సంతతి శాస్త్రవేత్తకు  అమెరికా ప్రెసిడెన్షియల్ అవార్డ్ - Sakshi

మెదడులోని నిర్మాణాలపై పరిశోధన చేస్తున్న మూర్తి ఎస్.కంభంపాటి
 
విశాఖపట్నం: విద్యార్థులకు శాస్త్రసాంకేతిక రంగాల్లో పరిశోధనాసక్తి పెంచేందుకు చేసిన కృషికిగాను భారత సంతతి శాస్త్రవేత్త మూర్తి ఎస్.కంభంపాటి ప్రతిష్టాత్మక అమెరికా ప్రెసిడెన్షియల్ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం అమెరికాలో న్యూ ఓర్లీన్స్‌లోని సదరన్ వర్సిటీలో జీవ శాస్త్రం ప్రొఫెసర్‌గా ఆయన పనిచేస్తున్నారు. కంభంపాటి విద్యార్థుల్లో పరిశోధనాసక్తిని పెంపొందించారని.. వారు అమెరికా భవిష్యత్ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు కృషి చేశారని పేర్కొంటూ అమెరికా అధ్యక్షుడు ఒబామా పేరిట వైట్‌హౌజ్ ఒక ప్రకటన జారీ చేసింది.

ప్రస్తుతం ఆయన స్క్రీజోఫీనియా (మనోవైకల్యం), అల్జీమర్స్(వృద్ధాప్యంలో మతిమరుపు), డిప్రెషన్ వంటి సమయాల్లో మెదడులోని నిర్మాణాల్లో మార్పులపై పరిశోధన చేస్తున్నారు.  ఈ అవార్డులకు ఎంపికైనవారిని వైట్‌హౌజ్‌లో సన్మానించడంతో పాటురూ. 6 లక్షలను  అందజేస్తారు. కంభంపాటి విశాఖపట్నంలోని ఆంధ్రా వర్సిటీ 1979లో బీఎస్సీ, 1981లో ఎమ్మెస్సీ(బోటనీ), 1988లో ఎకాలజీ విభాగంలో పీహెచ్‌డీ పూర్తిచేసి అమెరికాలోనూ ఉన్నత విద్యనభ్యసించారు. జాన్సన్ వర్సిటీలో 1990 నుంచి 1994 వరకు రీసెర్చ్ అసోసియేట్‌గా పనిచేశారు. ఇదే వర్సిటీలో ఎన్విరాన్‌మెంటల్ సెన్సైస్‌లో పీహెచ్‌డీ చేశారు.
 

Advertisement
Advertisement