ఇదేం ప్రజాస్వామ్యం.. | Sakshi
Sakshi News home page

దీదీ కాళ్లు మొక్కిన ఐపీఎస్‌ అధికారి

Published Wed, Aug 28 2019 5:41 PM

IPS Officer Touches Mamata Banerjee Feet Viral Video - Sakshi

కోల్‌కతా: ఆమె ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అతను బాధ్యతాయుతమైన ఐపీఎస్‌ అధికారి. వ్యక్తిగతంగా నాయకులు అంటే ఎంత గౌరవం, అభిమానం ఉన్నా సరే జనాల్లో ఉన్నప్పుడు మాత్రం ఎవరి హోదా ప్రకారం వారు నడుచుకోవాలి. లేదంటే విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. ఆ వివరాలు.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో దీదీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారం రోజుల క్రితం దీదీ దిఘాలో పర్యటించారు. ఈ సందర్భంగా దీదీ తనతో పాటు ఉన్న అధికారులకు కేక్‌ తినిపించారు. ఈ క్రమంలో ఓ అధికారి దీదీ పాదాలకు నమస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ నాయకుడు కైలాష్‌ విజయ్‌వర్గియా తన ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘ఇదేం ప్రజాస్వామ్యం.. ఆమె ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. అతడు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు. పైగా యూనిఫామ్‌లో ఉండి దీదీ పాదాలకు నమస్కరించి తన ఉద్యోగాన్ని అవమాన పరిచాడు’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertisement
Advertisement