Sakshi News home page

మాదక ద్రవ్యాల అడ్డా బెంగళూరు

Published Sun, Jun 4 2017 3:01 PM

మాదక ద్రవ్యాల అడ్డా బెంగళూరు - Sakshi

► ఒక్క నెలలోనే 242 మంది అరెస్ట్‌
► పట్టుబడిన వారిలో దేశీయులే అధికం
► విద్య, వ్యాపారం పేరుతో ఆఫ్రికా వాసుల డ్రగ్స్‌ రవాణా


సాక్షి, బెంగళూరు : దేశ ఐటీ రాజధానిగా పేరు గడించిన బెంగళూరు మాదక ద్రవ్యాల అడ్డాగా మారిపోతోంది. ఒక్క మే నెలలోనే 242 మంది డ్రగ్స్‌ అక్రమ రవాణాదారులను పోలీసులు అరెస్ట్‌ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. పట్టుబడిన వారిలో విదేశీలయులతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి బెంగళూరుకు డ్రగ్స్‌ రవాణా చేస్తున్న వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. డ్రగ్స్‌ రవాణాపై బెంగళూరు సీసీబీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఒక్క మేనెలలోనే 161 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకోవడంతో పాటు 187 మంది భారతీయులతో పాటు 55 మంది విదేశీయులు ఉన్నారు. పట్టుబడిన వారిలో ఎక్కువగా ఆఫ్రికన్లు ఉన్నారని నగర పోలీసు అదనపు కమిషనర్‌ రవి తెలిపారు.

గంజాయికి మొదటి స్థానం
పట్టుబడిన వాటిలో గంజాయిదే అగ్రస్థానం. ఆ తరువాత కొకైన్, ఎంఫెటమైన, మలేషియా నుంచి వచ్చే యాబా ట్యాబ్లెట్లు ఎక్కువగా స్వాధీనం చేసుకున్నట్లు సీసీబీ పోలీసులు చెబుతున్నారు. ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి రైళ్ల ద్వారా బెంగళూరుకు గంజాయిని రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక కొకైన్, ఇతర మత్తు పదార్థాలు ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల ద్వారా డ్రగ్స్‌ దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నారు.

ఉండలుగా మింగి...  
ఆఫ్రిక, యుగాండా, నైజీరియా దేశాలకు చెందిన డ్రగ్స్‌ స్మగ్లర్లు మాదక ద్రవ్యాలను రవాణా సమయంలో అత్యంత పకడ్భందీగా వ్యవహరిస్తారు. ఎవరికి అనుమానం రాకుండా మత్తు పదార్థాలను ఉండలుగా మింగుతారు. ఏయిర్‌ పోర్టు లలో కూడా బాడీ స్కానింగ్‌ యంత్రాలు వీటిని గుర్తించడం ఎంతో కష్టం. దీంతో స్మగ్లర్లు సులభంగా తప్పించుకుంటున్నారు. మలేషియా, హాంకాంగ్‌ నుంచి వచ్చే వారు రూ. లక్షల విలువైన మాదక ద్రవ్యాలను పలు రకాలుగా శరీరంలోనే ఇనుమడింప చేసుకుని రవాణా చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదే సమయంలో బెంగళూరు పోలీసులు వీరిపై పెద్ద ఎత్తున నిఘా పెడుతున్నారు. పట్టుబడితే అరెస్ట్‌ చేసి జైలుకు తరలిస్తున్నారు. ఇందులో నైజీరియన్లు ఎక్కువగా ఉన్నారని, వీరు విద్య, వ్యాపారం నిమిత్తం బెంగళూరు వచ్చి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు బెంగళూరు అదనపు పోలీస్‌ కమిషనర్‌ రవి తెలిపారు.

సంవత్సరం                          2017 మే    2016 మే
కేసులు                               135            128    
అరెస్ట్‌ అయిన వారు               242             285
విదేశియులు                        55               22
స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌      161 కిలోలు    276 కిలోలు
 

Advertisement
Advertisement