'ఏ అమ్మాయిని వారు విడిచిపెట్టలేదు' | Sakshi
Sakshi News home page

'ఏ అమ్మాయిని వారు విడిచిపెట్టలేదు'

Published Tue, Jan 3 2017 8:57 AM

'ఏ అమ్మాయిని వారు విడిచిపెట్టలేదు' - Sakshi

బెంగళూరు: 'ఇదొక భారీ హింస. అమ్మాయిలంతా కేకలు పెట్టారు. సాయం చేయండి అంటూ గట్టిగా అరిచారు. అయినా ఎవరూ స్పందించలేదు' అంటూ నూతన సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి భారత సిలికాన్‌ వ్యాలీ బెంగళూరులోని ఎంజీ రోడ్డులో అమ్మాయిలు, మహిళలపై జరిగిన కీచకపర్వాన్ని ఓ ప్రత్యక్ష సాక్షి వివరించింది.

'పార్టీలో యువకులు, ఇంకొందరు పురుషులు దారుణంగా ప్రవర్తించారు. ఏ అమ్మాయిని వారు విడిచిపెట్టలేదు. వారి ముందు నుంచి వెళుతున్న ప్రతి అమ్మాయిని తాకారు. బలవంతంగా దగ్గరకు లాక్కున్నారు. అభ్యంతరకరంగా తాకారు. కొంతమంది అమ్మాయిలను జుట్టుపట్టి ఈడ్చారు. వారి బట్టలు చింపేశారు. భయంతో ఏడుస్తూ పరుగెడుతున్నా వారిని వదలిపెట్టలేదు. సాధారణంగా ఒక్కరిపై ఇద్దరిపై అయితే పోరాడగలం. కానీ, అక్కడ ఉంది వేలమంది సమూహం. ఏం చేయగలం. వారు ఉద్దేశ పూర్వకంగా మహిళలను టార్గెట్‌ చేశారు. ఇది ఒక భారీ లైంగిక వేధింపుల ఘటనగా చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు తాగి ఉన్నారు. ఒకరినొకరు నెట్టుకుంటున్నారు. ఎంత అసభ్యంగా చేశారంటే మాటల్లో చెప్పలేం. ఒక్క అమ్మాయిని కూడా విచిచిపెట్టలేదు. ఒక మహిళ ఏడుస్తుంటే చూశాను. ఆమెకు రక్తం కారుతోంది. మొత్తం గాయాలయ్యాయి. అది చూసి నాకు చాలా భయమేసింది. అంత దారుణంగా అక్కడ యువకులు ప్రవర్తించారు' అంటూ ఆ ఘటనపై వివరణ ఇచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement