తొలిసారి జమ్మూకశ్మీర్‌కు జైట్లీ | Sakshi
Sakshi News home page

తొలిసారి జమ్మూకశ్మీర్‌కు జైట్లీ

Published Wed, May 17 2017 9:03 AM

తొలిసారి జమ్మూకశ్మీర్‌కు జైట్లీ

శ్రీనగర్‌: కేంద్ర రక్షణమంత్రి అరుణ్‌ జైట్లీ భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ బుధవారం జమ్ముకశ్మీర్‌లో పర్యటించనున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భద్రతా పరమైన అంశాలపై స్థానిక అధికారులు, మిలిటరీ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా నియంత్రణ రేఖవద్ద పాక్‌ ప్రతిక్షణం హద్దు మీరుతున్న విషయాన్ని విద్యార్థులు, యువత నెలకొన్న అసంతృప్తి అంశాలను ప్రధాన అజెండాగా చర్చించనున్నారు.

ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జైట్లీ గోవా ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా వెళ్లిన మనోహర్‌ పారికర్‌ నుంచి అదనంగా రక్షణశాఖ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. జైట్లీ రక్షణశాఖ మంత్రిగా బాధ్తలు తీసుకున్న తర్వాత కశ్మీర్‌ లోయకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఫీల్డ్‌ కమాండర్లను కూడా జైట్లీ కలవనున్నారు. ప్రస్తుతం సమర్థమైన పరిపాలనను స్థాపించే లక్ష్యంగానే జైట్లీ టూర్‌ ఉండనున్నట్లు కేంద్ర వర్గాల సమాచారం.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement