రైతు రుణాలకు రూ.లక్ష కోట్లు అధికం | Sakshi
Sakshi News home page

రైతు రుణాలకు రూ.లక్ష కోట్లు అధికం

Published Thu, Feb 1 2018 11:42 AM

jaitly allocates rs 11 lac cr to agri loans - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే చర్యలను కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. వచ్చే ఏడాది రూ. 11 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను అందచేస్తామని వెల్లడించారు. గత బడ్జెట్‌లో రూ. 10 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలను రైతులకు అందిస్తామని పొందుపరచగా 2018-19 బడ్జెట్‌లో రూ. లక్ష కోట్ల మేర రుణ వితరణ పెంచారు.

రైతులకు కనీసం 50 శాతం లాభాలు వచ్చేలా చూస్తామని.. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే చర్యలు చేపడతామన్నారు. వ్యవసాయం, గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతమే తమ ప్రాధాన్యతలని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement