జైల్లో లాలూకు సేవకులు: జేడీయూ | Sakshi
Sakshi News home page

జైల్లో లాలూకు సేవకులు: జేడీయూ

Published Wed, Jan 10 2018 1:25 AM

jdu on lalu prasad yadav - Sakshi

పట్నా/రాంచీ: దాణా కుంభకోణం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. జైలులో సేవలందించేందుకు ఇద్దరు కార్యకర్తలను నియమించుకున్నారని  జేడీయూ ఆరోపించింది. దాణా కుంభకోణం కేసులో ప్రస్తుతం ఆయన బిర్సా ముండా జైలులో ఉన్నారు.

ఈ కేసులో దోషిగా తేలటంతో న్యాయస్థానం మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు ఆయన్ను రాంచీ జైలుకు తరలించటానికి కొద్ది గంటల ముందే లక్ష్మణ్‌ మహతో, మదన్‌ యాదవ్‌ అనే నేరస్తులను అధికారులు అదే జైలుకు పంపారు. ఆ ఇద్దరూ ఆర్జేడీ కార్యకర్తలనీ తనకు సేవలు చేసేందుకు, వండి పెట్టేందుకు లాలూ నియమించుకున్నారని జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్‌ కుమార్‌ పేర్కొన్నారు. దీన్ని ఆర్జేడీ పార్టీ అధికార ప్రతినిధి శక్తిసింగ్‌ యాదవ్‌ ఖండించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement