Sakshi News home page

మ్యాగీ ఉద్యోగి ఆత్మహత్య

Published Tue, Jun 16 2015 12:13 PM

మ్యాగీ ఉద్యోగి ఆత్మహత్య - Sakshi

నైనితాల్: ఉత్తరాఖండ్లో ఓ మ్యాగీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్ధానిక మ్యాగీ సంస్థలో పనిచేస్తున్న అతడు ఆ సంస్థ మూత పడటంతో ప్రాణం బలి తీసుకున్నాడు. మ్యాగీలో ఆందోళన కలిగించిన లెడ్  మోతాదు నెస్లే కొంపముంచిన విషయం తెలిసిందే.  ఉత్తరాఖండ్ నైనితాల్కు సమీపంలోని రుద్రాపూర్లో ఓ మ్యాగీ ప్లాంట్ ఉంది. ఇందులో లల్టా ప్రసాద్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. నెస్లే కంపెనీ ఉత్పత్తులను 90  రోజులపాటు నిషేధించిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఆ సంస్థ మూతపడింది.

దీంతో అందులో పనిచేసేవారంతా రోడ్డున పడ్డారు. మానసికంగా కుంగిపోయిన ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 13 రోజుల తరువాత దాని పరిణామం వెలుగు  చూసింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. దాదాపు 1100 మంది కాంట్రాక్టు కార్మికులు రోడ్డున పడ్డారట. మరోవైపు ఉత్తరాఖండ్లోని మ్యాగీ  శ్యాంపిళ్లను పరిశీలించిన హైకోర్టు దీనిపై  నివేదిక పంపించాల్సిందిగా నెస్లేను కోరింది. తదుపరి విచారణను జూన్ 20 కి వాయిదా వేసింది. కాగా, మ్యాగీ నూడుల్స్ను నిషేధించడంతో రూ.320 కోట్ల విలువైన నూడుల్స్ను ధ్వంసం చేస్తున్నట్లు నెస్లే ఇండియా వెల్లడించింది. మార్కెట్, ఫ్యాక్టరీల్లోని నిల్వలను ఉపసంహరించుకున్నట్టు  ప్రకటించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement