అభివృద్ధి చెందిన దేశాల వల్లే పర్యావరణ కాలుష్యం | Sakshi
Sakshi News home page

అభివృద్ధి చెందిన దేశాల వల్లే పర్యావరణ కాలుష్యం

Published Tue, Apr 11 2017 2:40 AM

అభివృద్ధి చెందిన దేశాల వల్లే పర్యావరణ కాలుష్యం - Sakshi

సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పర్యా వరణ కాలుష్యానికి అభివృద్ధి చెందుతున్న భారత్‌ లాంటి దేశాల కంటే అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్‌ దేశాల వల్లే ఎక్కువ హాని కలుగుతోందని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌. ఠాకూర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘పర్యావరణ పరిరక్షణ, భారత్‌లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’ అన్న అంశంపై ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో సోమవారం జాతీయ సదస్సు జరిగింది. ఢిల్లీకి చెందిన క్యాపిటల్‌ ఫౌండేషన్, హైదరాబాద్‌కి చెందిన కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రివల్యూషన్‌ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో జస్టిస్‌ టీఎస్‌.ఠాకూర్‌ మాట్లాడుతూ.. పర్యావరణ కాలుష్యాన్ని ప్రపంచ సమస్యగా అభివర్ణిం చారు.

పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినందుకు జస్టిస్‌ కుల్దీప్‌ సింగ్‌ జాతీయ అవార్డును ఎన్జీటీ చైర్మన్‌ జస్టిస్‌ స్వతంత్రకుమార్‌కు, వార్షిక అవార్డులను మే ఫెయిర్‌ గ్రూప్‌ హోటల్స్‌ సీఎండీ దిలీప్‌ రే, సింబోటిక్‌ సైన్స్‌ సంస్థ చైర్మన్‌ రాకేష్‌ మల్హోత్రాలకు, ప్రొఫెసర్‌ టి.శివాజీ రావ్‌ జాతీయ అవార్డును ప్రొఫెసర్‌ ధర్మేంద్ర సింగ్‌కు ఇచ్చారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే.పట్నా యక్, జాతీయ హరిత ట్రిబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ స్వతంత్ర కుమార్, క్యాపిటల్‌ ఫౌండే షన్‌ ప్రధాన కార్యదర్శి డా. వినోద్‌ సేతి,  పర్యావరణవేత్త పురుషోత్తంరెడ్డి, కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రివల్యూషన్‌ వ్యవస్థాపకుడు లక్ష్మారెడ్డి, అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి, తూర్పు కనుమల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు దిలీప్‌ రెడ్డి, డా. దొంతి నరసింహారెడ్డి,  సంజీవరెడ్డి, మర్రి శశిధర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement