అద్దెకు పోలీసులు | Sakshi
Sakshi News home page

అద్దెకు పోలీసులు

Published Tue, Jun 2 2015 11:41 AM

అద్దెకు పోలీసులు - Sakshi

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) లోకి బీహార్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు పోలీసు అధికారుల్ని అద్దె ప్రాతిపదికన నియమించింది. ఈ నియామకాల విషయంలోనే లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్తో విభేధాలు తలెత్తి విషయం కోర్టువరకు చేరిన సంగతి తెలిసిందే.

ఇటీవలే కేజ్రీవాల్.. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను కలిసి ఢిల్లీకి పోలీసుల్ని కేటాయించాల్సిందిగా కోరారు. అందుకు నితిశ్ అంగీకారం తెలపడంతో అద్దె పోలీసులుల నియామకానికి అడ్డంకులు తొలిగిపోయాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ నేపథ్యంలో కేజ్రీ సర్కారు నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది. నియామకాలకు సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఢిల్లీ ఏసీబీలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో తామీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు  చెప్పాయి. అద్దెకు తీసుకున్నవారిలో ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు ఉన్నారని పేర్కొన్నాయి. ఇటీవలే బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను కేజ్రవాల్ తో కేజ్రీచర్చల్లో జరిగిన

అవినీతి రహిత పాలన అందించ క్రమంలో ఏసీబీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేజ్రీవాల్ భావిస్తున్నారని, ఆ మేరకు 600 మంది అధికారులు, 24 మంది ఇన్స్పెక్టర్లను నియమించాలని ఆయన భావించారని, అయితే లెఫ్టినెంట్ గవర్నర్ తన విశేషాధికారలను అడ్డుపెట్టుకొని ఢిల్లీ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకించడం వల్లే పక్క రాష్ట్రాల నుంచి పోలీసుల్ని అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆప్ వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement