ఈ సాయం చేస్తే ప‌ది ల‌క్ష‌లు మీ సొంతం | Sakshi
Sakshi News home page

కుటుంబాన్ని క‌లిపితే ప‌ది ల‌క్ష‌ల న‌జ‌రానా

Published Sun, May 10 2020 11:00 AM

Kerala Man Offers Rs 10 Lakhs To Bring Home Their Stranded Family - Sakshi

తిరువంతపురం: లాక్‌డౌన్ వ‌ల్ల కుటుంబ స‌భ్యులంద‌రూ ఒకే చోట క‌లిసి ఉండే అవ‌కాశం ద‌క్కింది. అయితే లాక్‌డౌన్ ప్ర‌క‌టించడానిక‌న్నా ముందు వేరు వేరు ప్ర‌దేశాల‌కు వెళ్లిన‌వారు మ‌ళ్లీ ఒక్క‌చోటుకు చేర‌లేక‌పోతున్నారు. ఇప్ప‌టికే ఈ నిర్బంధం విధించి సుమారు రెండు నెల‌లు కావ‌స్తున్నందున ఓ వ్య‌క్తి త‌న కుటుంబాన్ని స్వ‌స్థ‌లానికి చేర్చేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేసి విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో ఈసారి వారిని క‌లిపితే పారితోష‌కం ఇస్తానంటూ సోష‌ల్ మీడియాలో న‌జ‌రానా ప్ర‌క‌టించి వార్త‌ల్లో నిలిచాడు. కేర‌ళ‌కు చెందిన శ్రీకుమార్ ప‌ని రీత్యా దుబాయ్‌కు వెళ్లి ఇప్పుడ‌క్క‌డే చిక్కుకుపోయాడు. మ‌రోవైపు అత‌ని భార్య‌, చిన్న‌ కొడుకు మంగ‌ళూరులో, పెద్ద‌ కొడుకు తిరుచ్చిరాప‌ల్లిలో ఉన్నారు. (కరుణ లేని కరోనా!)

వేర్వేరు ప్ర‌దేశాల్లో ఉన్న వారిని ఒక‌చోటికి చేర్చేందుకు అత‌డెన్నో ప్ర‌య‌త్నాలు చేశాడు. అందులో భాగంగా ఎంతో మంది అధికారుల‌ను సంప్ర‌దించ‌గా వారి నుంచి క‌నీస స్పంద‌న క‌రువైంది. దీంతో అత‌నే సొంతంగా ఓ హెలికాప్ట‌ర్‌ను మాట్లాడుకున్నాడు. కానీ అది ఎగ‌ర‌డానికి అధికారులు అనుమ‌తించ‌లేదు. దీంతో అత‌ను చివ‌రి ప్ర‌య‌త్నంగా సోష‌ల్ మీడియా ఏమైనా సాయం చేస్తుందేమో చూద్దామ‌నుకున్నాడు. త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ను ఇంటికి సుర‌క్షితంగా చేర్చిన‌వారికి రూ.10 ల‌క్ష‌ల న‌జ‌రానా ప్ర‌క‌టించాడు. అయితే మంగ‌ళ‌వారంలోగా చేర్చాల‌ని గ‌డువు విధించాడు. మ‌రి క‌ళ్లు చెదిరే పారితోషాకాన్ని చూసి ఎంత‌మంది ముందుకొస్తారో? ఎవ‌రి ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందో? చూడాలి! (లాక్‌డౌన్‌: రికార్డు స్థాయిలో జనాభా పెరుగుదల)

Advertisement
Advertisement