Sakshi News home page

ఇలాగేనా వ్యవహరించేది!

Published Thu, Nov 24 2016 1:03 AM

ఇలాగేనా వ్యవహరించేది! - Sakshi

- నఖ్వీ, ఆనంద్ శర్మలపై కురియన్ ఆగ్రహం
- సభ నిర్వహణకు సహకరించాలని సూచన
 
 న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఎలాంటి చర్చ జరగకుండా వాయిదా పడుతున్నాయి. నోట్లరద్దుపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు, విపక్షాలపై చేయి అడ్డుకునేందుకు అధికార పక్షం ప్రయత్నించటంతో బుధవారం కూడా  కార్యక్రమాలు స్తంభించాయి. ఈ పరిస్థితిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ మండిపడ్డారు. ఇరు పక్షాలు ఆందోళన పక్కనపెట్టాలని సూచించారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మలపై మండిపడ్డారు. విపక్షాల ఆందోళనతో సభ మధ్యాహ్నం రెండు గంటలవరకు రెండుసార్లు వాయిదా పడింది. తర్వాత సభ ప్రారంభం కాగానే, ఆనంద్ శర్మను పారుుంట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తేందుకు అనుమతిచ్చారు.

శర్మ మైక్ తీసుకుంటూనే రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందంటూ మొదలుపెట్టారు. అధికార సభ్యులు నినాదాలతో అడ్డుకున్నారు. కురియన్ పలుమార్లు చెప్పినా బీజేపీ సభ్యులు వెనక్కు తగ్గలేదు. దీంతో ఆగ్రహించిన ఆయన నఖ్వీపై బీజేపీ సభ్యులపై   ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి  సభను అడ్డుకోవటం అధికార పక్షం ఉద్దేశం కాదని సభ జరుగుతున్న తీరుపై ఆవేదన కలుగుతోందని నఖ్వీ అన్నారు. ఏ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందంటూ శర్మను ప్రశ్నించారు. శర్మ రాజ్యాంగం పేపర్లు తిరగేస్తూ కనిపించారు. దీనిపై కురియన్ మండిపడ్డారు.  కాగా, గురువారం ప్రధాని రాజ్యసభలో ప్రసంగించే అవకాశం ఉంది. లోక్‌సభలో బుధవారం కూడా కార్యక్రమాలు స్తంభించాయి.  విపక్షాలువారుుదా తీర్మానానికి పట్టుబట్టాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధాని మోదీ కాసేపు లోక్‌సభలో ఉన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement