పాకిస్తానీలకు ఆధార్‌ కార్డులు.. ప్రభుత్వ వైద్యురాలి అరెస్టు | Sakshi
Sakshi News home page

పాకిస్తానీలకు ఆధార్‌ కార్డులు.. ప్రభుత్వ వైద్యురాలి అరెస్టు

Published Wed, May 31 2017 3:29 AM

lady doctor arrested in aadhar cards to pakistan people case

బనశంకరి: బెంగళూరులో ఇటీవల ముగ్గురు పాకిస్తానీల వద్ద ఆధార్‌ కార్డులు దొరికిన కేసులో స్థానిక జయనగర ప్రభుత్వాసుపత్రి సీనియర్‌ వైద్యురాలు డాక్టర్‌ టీఎస్‌ నాగలక్ష్మిని బనశంకరి పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. కొద్దిరోజుల క్రితం కుమారస్వామి లేఔట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని యారబ్‌నగరలో ఒక అద్దె ఇంట్లో తలదాచుకున్న కేరళకు చెందిన మహమ్మద్‌ సిహబ్, అతని పాకిస్థానీ భార్య సమీరా అలియాస్‌ నజ్మా, ఆమె బంధువు మహ్మద్‌ ఖాసిప్, అతని భార్య జనాబ్‌ అలియాస్‌ కిరణ అనే నలుగురిని క్రైంబ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేయడం తెలిసిందే.

వీరి వద్ద స్థానిక చిరునామాలతో ఆధార్‌ కార్డులు లభించడం  కలకలం రేపింది. మహ్మద్‌ సిహబ్‌ సీనియర్‌ వైద్యురాలు నాగలక్ష్మి నుంచి అవసరమైన సర్టిఫికెట్లు సంపాదించి వాటితో ఆధార్‌కా ర్డులను పొందినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. పాకిస్తానీలకు సహకరిం చిన ఆరోపణలపై నాగలక్ష్మి, అదే ఆస్పత్రి డాక్టర్‌ రవికుమార్‌ను సస్పెండ్‌ చేశారు.

Advertisement
Advertisement